హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS 2023 Exam Calendar Released: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ పరీక్ష తేదీలు విడుదల..

IBPS 2023 Exam Calendar Released: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ పరీక్ష తేదీలు విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2023 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది . RRB కోసం CRP, క్లర్క్, PO మరియు SPL వంటివి ఈ సంవత్సరం ఏ తేదీన నిర్వహించబడతాయో అభ్యర్థులు తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

బ్యాంక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. 2023-24 ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది..? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి..? తెలుసుకోండి.

IBPS Exam Calendar 2023: ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ వివరాలివే...

పరీక్ష పేరు తేదీలు
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ 2023 ఆగస్ట్ 05, 06, 12, 13, 19
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ 2023 సెప్టెంబర్ 10
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ 2023 సెప్టెంబర్ 10
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ 2023 సెప్టెంబర్ 16
 ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2023 ఆగస్ట్ 26,  27..  సెప్టెంబర్ 2
 ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 2023 అక్టోబర్ 07
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2023 సెప్టెంబర్ 23, 30. అక్టోబర్  01
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 2023 నవంబర్ 05
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2023 డిసెంబర్ 30, 31
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 2024 జనవరి 28

IBPS Exam Calendar 2022: ఐబీపీఎస్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్

అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్‌కు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థులు అడ్వర్టైజ్‌మెంట్‌లో వివరించినట్టుగా ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, చేతిరాతతో రాసిన డిక్లరేషన్ కాపీ అప్‌లోడ్ చేయాలి. మరిన్ని వివరాలను డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది ఐబీపీఎస్. ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో కావాలి. పరీక్ష తేదీకి రెండు నెలల ముందు జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్‌గా ఐబీపీఎస్ వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను తెలుగు, ఇంగ్లీష్, హిందీతో కలిపి మొత్తం 13 భాషల్లో నిర్వహించాలని ఇటీవల ఐబీపీఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీలకు, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు కూడా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని 2019 లో ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ప్రిలిమినరీ పరీక్షల్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని (NRA) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

First published:

Tags: Bank exams, Bank Jobs, Bank Jobs 2022, Calendar, IBPS

ఉత్తమ కథలు