IBPS EXAM CALENDAR 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION RELEASED 2022 23 EXAM CALENDAR FOR OFFICE ASSISTANT PROBATIONARY OFFICER AND OTHER POSTS SS
IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవే
IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవే
IBPS Exam Calendar 2022 | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది విడుదల చేయబోయే జాబ్ నోటిఫికేషన్ల (Job Notification) వివరాలను వెల్లడించింది. ఎగ్జామ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరగనుందో తెలుసుకోండి.
బ్యాంక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. 2022-23 ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? తెలుసుకోండి.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్‌కు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థులు అడ్వర్టైజ్‌మెంట్‌లో వివరించినట్టుగా ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర, చేతిరాతతో రాసిన డిక్లరేషన్ కాపీ అప్‌లోడ్ చేయాలి. మరిన్ని వివరాలను డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది ఐబీపీఎస్. ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఫాలో కావాలి. పరీక్ష తేదీకి రెండు నెలల ముందు జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్‌గా ఐబీపీఎస్ వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి.
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను తెలుగు, ఇంగ్లీష్, హిందీతో కలిపి మొత్తం 13 భాషల్లో నిర్వహించాలని గతేడాది ఐబీపీఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీలకు, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు కూడా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని 2019 లో ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ప్రిలిమినరీ పరీక్షల్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని (NRA) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేయాల్సి ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.