Home /News /jobs /

IBPS CLERK RECRUITMENT 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION TO RELEASE JOB NOTIFICATION TO FILL OVER 7000 CLERK POSTS SS

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 7,000 పైగా బ్యాంకు ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 7,000 పైగా బ్యాంకు ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 7,000 పైగా బ్యాంకు ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2022 | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో 7,000 పైగా క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2022 జూలై 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,000 పైగా బ్యాంకు ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాది ఇదే నోటిఫికేషన్ ద్వారా 7,855 క్లర్క్ పోస్టుల్ని (Clerk Jobs) భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా దాదాపు అన్ని పోస్టులు ఉంటాయని అంచనా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉంటాయి. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. జూలై 1న CRP Clerk XII నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

IBPS Clerk Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

















































 డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల 2022 జూలై 1
 రిజిస్ట్రేషన్ ప్రారంభం 2022 జూలై 21
 ఫీజు చెల్లింపు 2022 జూలై 1 నుంచి 2022 జూలై 21 వరకు
 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్ 2022 ఆగస్ట్
 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ 2022 ఆగస్ట్
 ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్ 2022 ఆగస్ట్
 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2022 సెప్టెంబర్
 ప్రిలిమినరీ ఫలితాల విడుదల 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
 మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్ 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
 మెయిన్ ఎగ్జామ్ 2022 అక్టోబర్
 ప్రొవిజనల్ అలాట్‌మెంట్ 2023 ఏప్రిల్

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ... టెన్త్ పాసైతే చాలు

IBPS Clerk Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఖాళీల సంఖ్య- 7,000 కన్నా ఎక్కువ ఉండే అవకాశం

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ

ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

వయస్సు- 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్

Coal India Recruitment 2022: నెలకు రూ.50,000 వేతనంతో కోల్ ఇండియాలో 1050 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IBPS Clerk Recruitment 2022: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఓపెన్ చేయాలి.

Step 2- CRP Clerical ఓపెన్ చేయాలి. (జూలై 1న నోటిఫికేషన్ అప్‌లోడ్ అవుతుంది)

Step 3- వివరాలు చదివి ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ పైన చేయాలి.

Step 4- Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- మీ పేరు, పుట్టిన తేదీ లాంటి బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 6- ఆ తర్వాత మీ ఫోటో, సంతకం, చేతితో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

Step 7- ఆ తర్వాత ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 8- వివరాలన్నీ ఓసారి చెక్ చేసి ఫీజు చెల్లించాలి.

Step 9- దరఖాస్తు సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు