Home /News /jobs /

IBPS CLERK RECRUITMENT 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION INVITES APPLICATIONS FOR 6035 POSTS KNOW EXAM PATTERN SS

IBPS Clerk Jobs 2022: డిగ్రీ పాసైనవారికి బ్యాంక్ జాబ్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

IBPS Clerk Jobs 2022: డిగ్రీ పాసైనవారికి బ్యాంక్ జాబ్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Jobs 2022: డిగ్రీ పాసైనవారికి బ్యాంక్ జాబ్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Jobs 2022 | బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 6035 క్లర్క్ పోస్టుల (Clerk Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

డిగ్రీ పాసయ్యారా? ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంక్ ఉద్యోగం మీ కలా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,035 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 308 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులు డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నవి కావడంతో దేశవ్యాప్తంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యం. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఐబీపీఎస్. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్


ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. సమయం మొత్తం 60 నిమిషాలు. ఈ మూడు టాపిక్స్‌లో కటాఫ్ మార్కుల్ని ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తుంది.

Jobs in TCS: బీఏ, బీకామ్ పాసయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్


ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. జనరల్, ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. సమయం 35 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 35 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. మొత్తం సమయం 160 నిమిషాలు.

మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయినవారికి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది. అంతకన్నా ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు 2022 జూలై 21 లోగా అప్లై చేయాలి. సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, అక్టోబర్‌లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. 2023 ఏప్రిల్‌లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఉంటుంది.

TCS Internship Program: బీటెక్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు

తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు ఉంటాయి. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, IBPS, Job notification, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు