Home /News /jobs /

IBPS CLERK RECRUITMENT 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION INVITES APPLICATIONS FOR 6035 CLERK POSTS KNOW NOTIFICATION DETAILS SS

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2022 | డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (IBPS Clerk Application Process) కొనసాగుతోంది. ఐబీపీఎస్ విడుదల చేసిన క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు జూలై 21 లోగా అప్లై చేయాలి.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రతీ ఏటా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా క్లర్క్ పోస్టుల భర్తీకి తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. IBPS CRP CLERKS-XII నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణలో 99, ఆంధ్రప్రదేశ్‌లో 209 పోస్టులున్నాయి. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూలై 21 లోగా దరఖాస్తు చేయాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2022: ఖాళీల వివరాలివే...

















మొత్తం ఖాళీలు6,035
తెలంగాణ99
ఆంధ్రప్రదేశ్209

Govt Jobs with Intermediate: ఇంటర్ పాసైనవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS Clerk Recruitment 2022: విద్యార్హతలివే...


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ

ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

వయస్సు- 2022 జూలై 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు. 1994 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు


IBPS Clerk Recruitment 2022: దరఖాస్తు విధానం


Step 1- అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో CRP Clerical పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత Common Recruitment Process for Clerical Cadre XII పైన క్లిక్ చేయాలి.

Step 4- డీటెయిల్డ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ లింక్ ఉంటుంది. అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 5- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 6- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 7- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 8- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 9- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 10- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 11- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 12- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 13- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.

Step 14- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

అభ్యర్థులు జూలై 21 లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 2022 జూలై 1 నుంచి 2022 జూలై 21 వరకు ఫీజు చెల్లించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, IBPS, Job notification, JOBS

తదుపరి వార్తలు