Home /News /jobs /

IBPS CLERK RECRUITMENT 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION INVITES APPLICATIONS FOR 308 CLERK POSTS IN TELANGANA AND ANDHRA PRADESH KNOW VACANCIES SS

IBPS Clerk Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో 308 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IBPS Clerk Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో 308 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో 308 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2022 | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ పాసైనవారు జూలై 21 లోగా దరఖాస్తు చేయాలి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,035 క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది 7,000 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తే ఈసారి 6,035 క్లర్క్ పోస్టుల్ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 308 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జూలై 21 చివరి తేదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఖాళీలతో పాటు ఐబీపీఎస్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2022: తెలంగాణలో ఖాళీల వివరాలు ఇవే...

























తెలంగాణ99
బ్యాంక్ ఆఫ్ ఇండియా1
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్1
పంజాబ్ నేషనల్ బ్యాంక్1
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా96

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు

IBPS Clerk Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు ఇవే...

































ఆంధ్రప్రదేశ్209
బ్యాంక్ ఆఫ్ ఇండియా10
కెనెరా బ్యాంక్1
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా61
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్1
యూకో బ్యాంక్3
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా133

Govt Jobs with Intermediate: ఇంటర్ పాసైనవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS Clerk Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల- 2022 జూలై 1

రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022 జూలై 21

ఫీజు చెల్లింపు- 2022 జూలై 1 నుంచి 2022 జూలై 21 వరకు

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 ఆగస్ట్

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2022 ఆగస్ట్

ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 ఆగస్ట్

ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2022 సెప్టెంబర్

ప్రిలిమినరీ ఫలితాల విడుదల- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

మెయిన్ ఎగ్జామ్- 2022 అక్టోబర్

ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2023 ఏప్రిల్

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Coal India Recruitment 2022: నెలకు రూ.50,000 వేతనంతో కోల్ ఇండియాలో 1050 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే


IBPS Clerk Recruitment 2022: అర్హతలివే


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల వయస్సు వివరాలు చూస్తే 2022 జూలై 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో, తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో, పుదుచ్చెరీ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో పరీక్షలు ఉంటాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, IBPS, Job notification, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు