Home /News /jobs /

IBPS CLERK RECRUITMENT 2022 INSTITUTE OF BANKING PERSONNEL SELECTION CRP CLERKS XII NOTIFICATION RELEASED WITH 6035 VACANCIES KNOW NOTIFICATION DETAILS SS

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 6,035 బ్యాంక్ జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 6,035 బ్యాంక్ జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 6,035 బ్యాంక్ జాబ్స్... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk Recruitment 2022 | ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో 6035 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 6,035 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. 2022-23 సంవత్సరం కోసం CRP CLERKS-XII నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 జూలై 21 లోగా అప్లై చేయాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2022: రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇవే...

















































































































































 మొత్తం ఖాళీలు 6,035
 తెలంగాణ 99
ఆంధ్రప్రదేశ్ 209
 అండమాన్ అండ్ నికోబార్ 04
 అరుణాచల్ ప్రదేశ్ 14
 అస్సాం 157
 బీహార్281
 చండీగఢ్ 12
 దాదర్ నగర్, డామన్ డయ్యూ 01
 ఢిల్లీ 295
 గోవా 71
 గుజరాత్ 304
 హర్యానా 138
 హిమాచల్ ప్రదేశ్ 91
 జమ్మూ అండ్ కాశ్మీర్ 35
 జార్ఖండ్ 69
 కర్ణాటక 358
 కేరళ 70
 లక్షద్వీప్ 05
 మధ్యప్రదేశ్ 309
 మహారాష్ట్ర 775
 మణిపూర్ 04
 మేఘాలయ 06
 మిజోరం 04
 నాగాలాండ్ 04
 ఒడిషా 126
 పుదుచ్చేరి 02
 పంజాబ్ 407
 రాజస్థాన్ 129
 సిక్కిం 11
 తమిళనాడు 288
 త్రిపుర 17
 ఉత్తర ప్రదేశ్ 1089
 ఉత్తరాఖండ్ 19
 పశ్చిమ బెంగాల్ 528

Coal India Recruitment 2022: నెలకు రూ.50,000 వేతనంతో కోల్ ఇండియాలో 1050 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

IBPS Clerk Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల- 2022 జూలై 1

రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022 జూలై 21

ఫీజు చెల్లింపు- 2022 జూలై 1 నుంచి 2022 జూలై 21 వరకు

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 ఆగస్ట్

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2022 ఆగస్ట్

ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 ఆగస్ట్

ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2022 సెప్టెంబర్

ప్రిలిమినరీ ఫలితాల విడుదల- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

మెయిన్ ఎగ్జామ్- 2022 అక్టోబర్

ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2023 ఏప్రిల్

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Govt Jobs with Intermediate: ఇంటర్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే


IBPS Clerk Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ

ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

వయస్సు- 2022 జూలై 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు. 1994 జూలై 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్

మీడియం ఆఫ్ ఎగ్జామ్- ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, పుదుచ్చెరీ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank Jobs, Central Government Jobs, Govt Jobs 2022, IBPS, Job notification, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు