హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs 2021: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ నోటిఫికేషన్ వచ్చేస్తోంది

Bank Jobs 2021: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ నోటిఫికేషన్ వచ్చేస్తోంది

IBPS Clerk Recruitment 2021 | ఐబీపీఎస్ త్వరలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2021 | ఐబీపీఎస్ త్వరలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2021 | ఐబీపీఎస్ త్వరలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకింగ్ రంగంలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇప్పట్నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 2557 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఐబీపీఎస్. ఈసారి కూడా అదే స్థాయిలో ఖాళీలు ఉండొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఐబీపీఎస్. జూన్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అక్టోబర్‌లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్ ఫాలో కావాలి.

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    Coal India Jobs 2021: కోల్ ఇండియాలో 361 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    నోటిఫికేషన్ విడుదల- 2021 జూన్

    దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్

    ప్రిలిమ్స్ కాల్ లెటర్ విడుదల- 2021 ఆగస్ట్

    ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 ఆగస్ట్ 28, 29, సెప్టెంబర్ 4, 5

    ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2021 సెప్టెంబర్

    మెయిన్స్ కాల్ లెటర్స్- 2021 అక్టోబర్

    మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 31

    మెయిన్స్ ఫలితాల విడుదల- 2022 ఏప్రిల్ 1

    Prasar Bharati Recruitment 2021: దూరదర్శన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    TIMS Recruitment 2021: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 199 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ

    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ

    కంప్యూటర్ లిటరసీ- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.

    వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు.

    దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100.

    First published:

    Tags: Bank Jobs 2021, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, IBPS, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

    ఉత్తమ కథలు