IBPS CLERK RECRUITMENT 2021 INSTITUTE OF BANKING PERSONNEL RELEASED JOB NOTIFICATION FOR 5830 CLERK POSTS IN PUBLIC SECTOR BANKS KNOW VACANCIES IN TELANGANA AND ANDHRA PRADESH SS
IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
IBPS Clerk Recruitment 2021 | ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు తెలుసుకోండి.
బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ క్లర్క్ 11 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,830 క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్.
IBPS Clerk Recruitment 2021: రాష్ట్రాలవారీగా ఖాళీల వివరాలు ఇవే...
IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 2021 జూలై 13
దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 1
దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2021 ఆగస్ట్ 1
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2021 ఆగస్ట్
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2021 ఆగస్ట్ 16 నుంచి
ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2021 ఆగస్ట్
ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 ఆగస్ట్ 28, 29, సెప్టెంబర్ 4
ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 సెప్టెంబర్, అక్టోబర్
మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2021 అక్టోబర్
మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 అక్టోబర్ 31
ప్రొవిజినల్ అలాట్‌మెంట్- 2022 ఏప్రిల్
IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే, పనిచేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.
వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు. అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 2001 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.