బ్యాంక్ ఉద్యోగం మీ కలా? మంచి అవకాశం వచ్చేసింది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేసేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 333, ఆంధ్రప్రదేశ్‌లో 387 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీ. దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.
SBI PO Notification 2021: ఎస్బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్
ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తుంది ఐబీపీఎఎస్. ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. సమయం 20 నిమిషాలు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సమయం 60 నిమిషాలు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. సమయం 35 నిమిషాలు. జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. సమయం 35 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మొత్తం సమయం 160 నిమిషాలు.
Railway Jobs: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఇంగ్లీష్ తప్ప మిగతా టాపిక్స్‌పై ప్రశ్నలు అభ్యర్థులు కోరుకున్న భాషలో ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్ని, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్ని ఎంచుకోవచ్చు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్‌లో ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. అంటే నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు బ్యాంకులో ఉన్న ఖాళీలను బట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, IBPS, Job notification, JOBS