• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • IBPS CLERK RECRUITMENT 2020 KNOW ABOUT APPLICATION STEPS 1557 CLERK POSTS SS

IBPS Clerk 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 1557 క్లర్క్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

IBPS Clerk 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 1557 క్లర్క్ పోస్టులకు అప్లై చేయండి ఇలా

IBPS Clerk 2020: బ్యాంకు ఉద్యోగం మీ కలా? 1557 క్లర్క్ పోస్టులకు అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

IBPS Clerk 2020 | నిరుద్యోగులకు అలర్ట్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీ జరుగుతోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు డెడ్‌లైన్ 2020 సెప్టెంబర్ 23న ముగుస్తుంది. మొత్తం 1557 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఖాళీలున్నాయి. డిగ్రీ పాసైనవారెవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఆసక్తి గల అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి, కావాల్సిన అర్హతలు ఉన్నాయో లేవో తెలుసుకొని అప్లై చేయాలి. మరి 1557 క్లర్క్ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

    Work From Home Jobs: మీకు ఈ 6 స్కిల్స్ ఉన్నాయా? ఇంటి నుంచే జాబ్ చేయొచ్చు

    BEL Jobs 2020: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ జాబ్స్... హైదరాబాద్, వైజాగ్‌లో ఖాళీలు

    IBPS Clerk 2020: దరఖాస్తు చేసే విధానం ఇదే...


    అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు పాస్ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర స్కాన్ చేయాలి. వీటితో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి కావాల్సిన వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ తర్వాత అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలోనే CRP Clerks X లింక్ కనిపిస్తుంది క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి. ఈ వివరాలు ఎస్‌ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి. ఆ తర్వాత ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సేవ్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసేముందు వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనే ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

    SBI Jobs: ఎస్‌బీఐలో 14,000 ఉద్యోగాలు... నాలుగు నెలల్లో భర్తీ

    Railway Jobs: రైల్వే సంస్థలో 1000 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 23 వరకు అవకాశముంది. అయితే అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేస్తే సాంకేతిక సమస్యలు ఉండవు. చివరి రోజైతే సర్వర్‌పై లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల దరఖాస్తు చేయడంలో సమస్యలు రావొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: