Bank Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ జాబ్స్... అక్టోబర్ 9 లాస్ట్ డేట్

IBPS Clerk Recruitment 2019 | క్లరికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 9 చివరి తేదీ. 

news18-telugu
Updated: October 5, 2019, 10:55 AM IST
Bank Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ జాబ్స్... అక్టోబర్ 9 లాస్ట్ డేట్
Bank Jobs: ప్రభుత్వ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ జాబ్స్... అక్టోబర్ 9 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 పోస్టులున్నాయి. తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్‌లో 777 పోస్టులు. ప్రతీ ఏటా ప్రొబెషనరీ ఆఫీసర్, క్లరికల్ పోస్టుల్ని భర్తీ చేస్తుంటుంది ఐబీపీఎస్. కొన్ని రోజుల క్రితమే ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తైంది. ఇప్పుడు క్లరికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 9 చివరి తేదీ.  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 12,074 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. అలాహాబాద్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, ఇండియన్ ఓర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పోస్టుల్ని నియమించనుంది. క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS Clerk Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 17

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్‌కు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2019 నవంబర్
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్‌: 2019 నవంబర్, డిసెంబర్


ఐబీపీఎస్ ప్రిలిమ్స్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 2019 నవంబర్
Loading...
ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2019 డిసెంబర్ 07, 08, 14, 15
ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్: 2019 డిసెంబర్ / 2020 జనవరి
మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2020 జనవరి
ఐబీపీఎస్ మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2020 జనవరి 19
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్

IBPS Clerk Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి.
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ ఆబ్జెక్టీవ్ టైప్ టెస్ట్, కంప్యూటర్ బేస్ట్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

IBPS Clerk Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయండి.
క్లర్క్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు... వారికి మాత్రమే

IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు... వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం
First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...