రచయిత: వేణుగోపాల్ రాజు, ప్రైమ్ ప్లస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, తిరుపతి
GT Hemanth Kumar, News18, Tirupati
సాధారణంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ (English) చాలా కష్టం అనే భావన అనేక మందిలో ఉంటుంది. కానీ మనం చిన్ననాటి నుంచి గ్రామర్ అనేది ప్రతీ ఇంగ్లీష్ క్లాస్ లో వింటూనే ఉంటాము. ముఖ్యంగా గ్రామర్ పార్ట్ ఐబీపీఎస్ పరీక్షలో ప్రాధాన్యత ఉంటుంది. టెన్సెస్, పార్ట్స్ అఫ్ స్పీచ్, కంప్రెసివ్ టెస్ట్ కావచ్చు. Antonyms and Synonymsను ఐదు మార్కులకు ఇవ్వడం ఖాయం. అధిక శాతం ఇంగ్లీష్ పై దృష్టి పెట్టకపోతే ఐబీపీఎస్ పరీక్ష (IBPS Exam) లో విఫలం అవ్వడం ఖాయం. దీంతో పాటు సెక్షనల్ కట్ అఫ్ రీచ్ అవ్వలేరు. గ్రామర్ పై పట్టు ఉంటె ఐబీపీఎస్ లో మీరు పట్టు సాధించినట్లే. ఒకాబిలరీ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉటుంది. ఎర్రర్స్ సంబంధించిన రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ కు సంబంధించి 120 రూల్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా నేర్చుకోవాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ (Bank Exams) లో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి గ్రామర్, రెండవది ఒకబిలరీ, మూడవది రీడింగ్, నాల్గవదీ లాజిక్.
ఈ నాలుగు విభాగాలను ఇంగ్లీష్ లో ఫోకస్ చేయడం ద్వారా బ్యాంక్ పరీక్షలు ఏవైనా మార్కులు మీ సొంతం. బ్యాంకింగ్ పరీక్ష రాసే అభ్యర్థులు కష్టంగా భావించేది ఇంగ్లీష్ మాత్రమే. మిగిలిన సబ్జెక్టులలో లాగా షార్ట్ కట్స్ ఇంగ్లీష్ కి ఉండదు. ఏవైనా ఇంగ్లీష్ పేపర్ చదవడం ద్వారా మూడు వేల కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ఒకబిలరీ చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్టి కొట్టే మెథడ్ కి వెళ్లే తప్పు చేసినట్లే అవుతుంది. చదువుకోవడం ద్వారా కొత్త కొత్త పదాలు అందుబాటులోకి వస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతూ ఉంటారు. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అడుగుతున్నారు. కొత్తగా వార్డ్ రీప్లేస్ మెంట్ అడుగుతున్నారు. మరియు మ్యాచ్ ది కాలమ్స్ అనే ప్రశ్నలు అడుగుతున్నారు.
ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో చేర్చడం జరిగింది. చాలా మంది ఒకబిలరీ సాల్వ్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. లిమిటెడ్ పార్ట్ అఫ్ ఒకబిలరీ రావడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్నప్పటి నుంచి గ్రామర్ ను చదువుతూనే ఉన్నాం. పార్ట్స్ అఫ్ స్పీచ్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, మోడల్ వర్క్స్, ఆర్టికల్స్, ప్రిపసన్స్ అనే టాపిక్స్ ను పూర్తిగా చదువుకోవాలి. దీన్ని ఓ బుక్ కొనుగోలు చేసి పై టాపిక్స్ పై ప్రిపేర్ అవ్వవచ్చు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా ఒకబిలరీ తో పాటుగా రీడింగ్ కాన్సెప్ట్ ఫుల్ ఫిల్ చేయగలరు.
రోజుకి రెండు గంటల సమయం న్యూస్ పేపర్ చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్, న్యూ వర్డ్స్ ఐడెంటిఫికేషన్, ప్రతీ పేరాలో వచ్చిన డిఫికల్ట్ వార్డ్స్ వస్తే వాటిని అలలైజ్ చేసి, అండర్ లైన్ చేసుకోవాలి. డిక్షనరీ ద్వారా అర్థాలు వాటి తెలుసుకొని సాధన చేయాలి. పేరాగ్రాఫ్ ను జుంబుల్ చేసి ఇస్తారు. వాటిని మనం అర్థం వచ్చే పేరాగ్రాఫ్ లా మార్చాలి. దీనికి ముఖ్యంగా లాజికల్ తీరి అవసరం ఉంది. ఇందుకు లాజికల్ థింకింగ్ వార్స్ చాలా అవసరం. మండేటరీ పెయిర్ ను వెతకడం కూడా ముఖ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank exam, Career and Courses, Central Government Jobs, Ibps clerks, JOBS