ఐబీపీఎస్ క్లర్క్-2022 ప్రిలిమ్స్ (IBPS Clerk 2022) అడ్మిట్ కార్డులను (Admit Cards) విడుదల చేసింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రిలిమ్స్ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్ పరీక్ష.. ఆగస్టు 28, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4 తేదీల్లో జరగనుంది.
* ఐబీపీఎస్ క్లర్క్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం
స్టెప్-1: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) అధికారిక వెబ్‌సైట్ ibps.inను సందర్శించాలి.
స్టెప్-2: హోమ్‌పేజీలో CRP-క్లర్క్స్ XII ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: ఆ తరువాత లాగిన్ వివరాలను నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: ప్రిలిమ్స్ పరీక్ష కోసం మీ IBPS క్లర్క్ అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది.
స్టెప్-5: భవిష్యత్తు అవసరాల కోసం కాపీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్- 2022 డౌన్‌లోడ్ లింక్ సెప్టెంబర్ 4, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాలుగో తేదీ తరువాత క్లర్క్ కాల్ లెటర్‌ను యాక్సెస్ చేసుకోలేరు. అడ్మిట్ కార్డ్‌ను ఎగ్జామ్ హాల్‌కు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు.
ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ల (PO) పరీక్షలు సైతం నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఐబీపీఎస్ పీవో పరీక్షలు అక్టోబర్ 15, 16, 22వ తేదీల్లో జరగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈసారి 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది.
ఐబీపీఎస్ పీఓ (IBPS PO) ప్రిలిమ్స్ పరీక్ష మూడు సెక్షన్లు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌గా ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. పరీక్ష ఫార్మాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్‌గా ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మూడు సెక్షన్లలో కనీస కటాఫ్ మార్కులను స్కోర్ చేయడం తప్పనిసరి.
* రీజనింగ్ ఎబిలిటీ
గత కొన్ని సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. స్క్వేర్ బేస్డ్ పజిల్ (ఇన్‌సైడ్ అండ్ ఔట్ సైడ్), బాక్స్ బేస్డ్ పజిల్, ఫ్లోర్-బేస్డ్ పజిల్, వర్డ్ అరేంజ్మెంట్ అండ్ నంబర్ పెయిరింగ్ వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ముందుగా పజిల్స్/సీటింగ్ అరెజ్మెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. థియరీ అండ్ రీజనింగ్ విభాగాలను బాగా అర్థం చేసుకోవడానికి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసే అలవాట్లను పెంపొందించుకోవాలి.
ఇది కూడా చదవండి : డిగ్రీ అర్హత.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. వివరాలిలా..
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
గత ప్రశ్న పత్రాలను గమిస్తే ఈ సెక్షన్‌లో సింప్లిఫికేషన్, అర్థమెటిక్, క్వాడ్రటిక్ ఈక్వేషన్, ట్యాబులర్ అండ్ బార్ గ్రాఫ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మంచి స్కోర్ సాధించాలంటే.. ముందుగా డేటా ఇంటర్‌ప్రిటేషన్ (DI)ను ప్రయత్నించాలి. ఆ తర్వాత నంబర్ సిరీస్ పై దృష్టిసారించాలి.
* ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఐబీపీఎస్ పీఓ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో మంచి స్కోర్ సాధించాలంటే కీలక టాఫిక్స్.. ఫిల్లర్ వర్డ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, క్లోజింగ్ ఎక్స్‌సర్‌సైజస్, ఎర్రర్ డిటెక్షన్, ఫ్రేజ్ రీఫ్లేస్‌మెంట్, జంబుల్డ్ ఫ్రేజ్, ఆడ్ వన్ ఔట్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Career and Courses, IBPS, Ibps clerks, JOBS