ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ను విడుదల చేసింది. క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ibps.in ను సందర్శించడం ద్వారా వారి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 6000 కంటే ఎక్కువ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తుంది. IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ సాధారణంగా రెండు దశలను కలిగి ఉంటుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్. తర్వాత తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Step 1- అభ్యర్థులు ముందుగా IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి.
Step 2- ఆ తర్వాత వెబ్‌సైట్ హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న IBPS క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3- అడ్మిట్ కార్డ్ కోసం లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత.. లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
Step 4- లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత.. మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనపడుతుంది.
Step 5- దానిని డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు..
IBPS క్లర్క్ 2022 అడ్మిట్ కార్డ్ విడుదల చేయబడింది - ఆగస్టు 17, 2022
IBPS క్లర్క్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ 2022 - సెప్టెంబర్ 4, 2022
IBPS క్లర్క్ పరీక్ష తేదీ (ప్రిలిమ్స్) - ఆగస్ట్ 28 అండ్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించబడుతుంది.
పరీక్ష విధానం..
మూడు సబ్జెక్టుల నుండి 100 ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ నుండి 35-35 ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ విభాగం నుండి 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అభ్యర్థి ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు పొందుతారు. తప్పు సమాధానానికి 0.25 మార్కులు తీసివేయబడతాయి.
ప్రతి సంవత్సరం, IBPS (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేయడానికి IBPS క్లర్క్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం భాగస్వామ్య బ్యాంకులు — బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank exams, Bank news, Career and Courses, IBPS, Ibps clerks, JOBS