IBPS Clerk 2021: బ్యాంకు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా..అయితే గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల..

(ప్రతీకాత్మక చిత్రం)

గతంలో ప్రకటించిన 7800 ఖాళీలకు బదులుగా తాజా నోటిఫికేషన్ ద్వారా 7858 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ibps.in వెబ్ సైట్ ద్వారా అదనపు సమాచారం పొందవచ్చు.

  • Share this:
బ్యాంకు క్లర్క్ పోస్టులకు సంబంధించి ఐబీపీఎస్ ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఐబీపీఎస్ క్లర్క్-2021 ఖాళీలకు సంబంధించి రివైడ్జ్‌ నోటిఫకేషన్‌ విడుదల చేసింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ప్రస్తుతం ఖాళీల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గతంలో ప్రకటించిన 7800 ఖాళీలకు బదులుగా తాజా నోటిఫికేషన్ ద్వారా 7858 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ibps.in వెబ్ సైట్ ద్వారా అదనపు సమాచారం పొందవచ్చు.

క్లర్క్ పోస్టులకు అర్హత
కొత్త నోటిఫికేషన్ ద్వారా గతంలో ఉన్న ఫోస్టులకు అదనంగా మరో 58 భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబరు 27గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని ఐబీపీఎస్ తెలిపింది. మరే ఇతర పద్దతులను ఐబీపీఎస్ అనుమతించదు.

పరీక్షలు ఎప్పుడు?
2021 డిసెంబరులో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2022 జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన వారి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్టు ఐబీపీఎస్ తెలిపింది. రివైడ్జ్ నోటిఫికేషన్‌ వెల్లడించిన నేపథ్యంలో.. నేటి నుంచి అక్టోబరు 27 వరకు అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించవచ్చు.

అవసరమైన అర్హతలు లేకుంటే ఈ పరీక్ష రాయడానికి అనుమతించరు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు సిస్టమ్ జనరేట్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ తీసుకోవాలి. తదుపరి రిఫరెన్స్‌కు ఇది ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఏ ప్రకటన అయినా అధికారిక వెబ్ సైట్లో పబ్లిష్ చేయనున్నారు. మరిన్ని అప్ డేట్స్ కోసం ibps.in వెబ్ సైట్ ఫాలో అవుతూ ఉండాలి.

IBPS PO Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు


DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు

Published by:Krishna Adithya
First published: