దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 7,855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష నిర్వహణకు అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ విడుదల చేసింది. ఈ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 19 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ibps.in లో పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు డిసెంబర్ 19, 2021 వరకు అడ్మిట్ కార్డులు (Admit Cards) డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో.. పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనే విధానం..
Step 1: అడ్మిట్ కార్డులు కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ibps.in/ ను సందర్శించాలి.
Step 2: వెబ్‌సైట్‌లో, CRP- CLERK -XI - ప్రిలిమినరీ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: అనంతరం అభ్యర్థులు లాగిన్‌లో రిజస్టర్ నంబర్ (Register Number), పుట్టిన తేదీ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 4: పరీక్షకు సంబంధించిన ఏదైనా వివరాల విషయంలో అభ్యర్థులకు అనుమానం ఉంటే ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన హ్యాండ్అవుట్‌ని చదవాలి.
ప్రిలిమినరీ పరీక్ష
అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam)ను నిర్వహిస్తారు. ఇది గంట వ్యవధితో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
న్యూమెరికల్ ఎబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
రీజనింగ్ | 35 | 35 | 20 నిమిషాలు |
ఇంగ్లీష్ | 30 | 30 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు |
NEET Exam: ఏడాది రెండు సార్ల నీట్.. విద్యా, ఆరోగ్యశాఖ యోచన
మెయిన్ పరీక్ష విధానం..
ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్ పరీక్ష కూడా ఆన్‌లైన్ (Online) విధానంలోనే జరుగుతుంది. మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది.
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ అవేర్‌నెస్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 50 | 50 | 35 నిమిషాలు |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 | 60 | 45 నిమిషాలు |
కాంపిటేటీవ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 45 నిమిషాలు |
ఇంగ్లీష్ | 40 | 40 | 35 నిమిషాలు |
మొత్తం | 200 | 100 | 160 నిమిషాలు |
ఐబీపీఎస్ (IBPS) క్లర్క్ పరీక్ష ఇక ప్రాంతీయ భాషల్లో రాసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఐబీపీఎస్ పరీక్ష తెలుగులోనే రాయొచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలయైన . ఐబీపీఎస్ సీఆర్‌పీ క్లర్క్- XI (IBPS CRP-XI) పరీక్ష తెలుగులోనే రాయొచ్చు.
ముఖ్యమైన సమాచారం..
ప్రిలిమ్స్ ఎగ్జామ్ : డిసెంబర్ 12, 2021 నుంచి డిసెంబర్ 19, 2021
ప్రిలిమ్స్ ఫలితాలు : డిసెంబర్, 2021 / జనవరి, 2022
మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు : జనవరి, 2022
మెయిన్ ఎగ్జామ్ : జనవరి / ఫిబ్రవరి 2022
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ : ఏప్రిల్, 2022
అధికారి వెబ్‌సైట్ : https://ibps.in/
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2021, Govt Jobs 2021, IBPS, JOBS