హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Jobs Preparation Tips: ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. న్యూమరికల్ ఎబిలిటీ టిప్స్ ఇవే.. ఓ లుక్కేయండి

IBPS Jobs Preparation Tips: ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. న్యూమరికల్ ఎబిలిటీ టిప్స్ ఇవే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షల్లో (IBPS Clerk Exam) న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ చాలా ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బాగా సాధన చేయడం ద్వారా అభ్యర్థులు ఈ టాపిక్స్ లో బెస్ట్ స్కోర్ చేయవచ్చు.

  రచయిత: నిరంజన్, ఆప్టిట్యూడ్ అధ్యాపకులు, పేస్ ఇన్స్టిట్యూట్, తిరుపతి

  (సేకరణ: GT Hemanth Kumar, News18, Tirupati)

  ఐబీపీఎస్ (IBPS) కంపిటేటివ్ పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీ పై పట్టు సాధించాలంటే సాధన చేయాల్సిందే. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షల్లో (IBPS Clerk Exam) న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ చాలా ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క టాపిక్ పూర్తిగా నేర్చుకోవడం ద్వారా చాలా వరకు ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వవచ్చు. క్యాలుకులేషన్ వేగంగా చేయడం.. పర్సెంటెజ్ అప్లికేషన్, ఆల్జీబ్రాలోని ఫార్ములాస్ పై మనకు అవగాహన ఉండాలి. పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే... సింప్లిఫికేషన్స్, పర్సెంటెజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇన్ట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలసిస్ వంటి వాటిలో పర్సంటేజ్ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. పర్సంటేజ్ కాసెప్ట్ బాగా నేర్చుకుంటే స్కోరింగ్ కు మంచి అవకాశం ఉంటుంది.

  ఆల్జీబ్రా లో చిన్న చిన్న ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. రేషియో కాన్సెప్ట్స్ ఉంటాయి. రేషియో ప్రపోషన్ ఒక టాపిక్ అయితే, అలిగేషన్ మిక్చార్ మరో టాపిక్ ఉంటుంది. పార్ట్నర్ షిప్ ఏజ్ అనే మరో టాపిక్ ఉంటుంది. రేషియో ఒక్క టాపిక్ నేర్చుకోవడం ద్వారా అందులో మిగిలిన మరో మూడు టాపిక్స్ ను సులభంగా చేయవచ్చు. ఇక టైం సిరీస్ లో మరో మూడు టాపిక్స్ ఉంటాయి. టైం, ఎఫిషియెన్సీ, వర్క్ అనేవి టైం సిరీస్ లో భాగం. ఈ మూడు టాపిక్స్ నేమ్స్ మార్చుకుంటూ ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి.

  IBPS Clerk Exam: మీరు బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దం అవుతున్నారా? ఇలా ప్రిపేర్ అయ్యారంటే అలా జాబ్ వచ్చేస్తుంది !

  పైన చెప్పిన మూడు కాన్సెప్ట్స్ ను మూడు బ్లాకులుగా డివైడ్ చేసి నేర్చుకుంటే మంచిది. ఇక నంబర్ సిస్టం, LCF, ఎంసీఎఫ్ టాపిక్స్, Mensuration కనిపిస్తాయి. న్యూమరికాల్ ఎబిలిటీ వేరూ, గణిత శాస్త్రం వేరు అనుకుంటే పొరపాటు పడినట్లే. టూ డైమెన్షన్, త్రి డైమెన్షన్ కూడా చదివితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది.

  అయితే ఐబీపీఎస్ పరీక్షలు రెండు దశల వారీగా నిర్వహిస్తారు. అందులో ఒక్కటి ప్రిలిమినరీ, మరొకటి మెయిన్స్. ప్రిలిమినరీ లో ఉత్థిర్ణత సాధించిన వారు మెయిన్స్ కు అర్హత పొందుతారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank Jobs, IBPS, JOBS

  ఉత్తమ కథలు