హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Bank Exam Tips: ఐబీపీఎస్ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే..

IBPS Bank Exam Tips: ఐబీపీఎస్ ఎగ్జామ్ కు సిద్ధమవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీకోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐబీపీఎస్ కంపిటేటివ్ పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీ పై పట్టు సాధించాలంటే సాధన చేయాల్సిందే. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ చాలా ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  రచయిత: కేశవులు నాయుడు, డైరెక్టర్, శ్రీధర్ సీసీఈ, తిరుపతి
  (GT Hemanth Kumar, News18Tirupati)


  ఐబీపీఎస్ (IBPS) కంపిటేటివ్ పరీక్షల్లో న్యూమరికల్ ఎబిలిటీ పై పట్టు సాధించాలంటే సాధన చేయాల్సిందే. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షల్లో (IBPS Exams) న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ చాలా ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క టాపిక్ తరవుగా నేర్చుకోవడం ద్వారా చాలా వరకు ప్రశ్నలు మనం సమాధానం ఇవ్వవచ్చు. క్యాలుకులేషన్స్ వేగంగా చేయడం, పర్సెంటెజ్ అప్లికేషన్, ఆల్జీబ్రాలోని ఫార్ములాస్ మనకు అవగాహన ఉండాలి. పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే.. సింప్లిఫికేషన్స్, పర్సెంటెజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇన్ ట్రస్ట్, కాంపౌండ్ ఇన్ ట్రస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలసిస్ వంటి వాటిలో పర్సంటేజ్ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది. ఒక్క పర్సెంటెజ్ కాసెప్ట్ స్కోరింగ్ కు మంచి అవకాశం ఉంటుంది. ఆల్జీబ్రా లో చిన్న చిన్న ఫార్ములాస్ బాగా కంఠాపాఠం చేయాలి. రేషియో కాన్సెప్ట్స్ ఉంటాయి. రేషియో ప్రపోషన్ ఒక టాపిక్ అయితే.. అలిగేషన్ మిక్చార్ మరో టాపిక్ ఉంటుంది.


  పార్ట్నర్ షిప్ ఏజ్ అనే మరో టాపిక్ ఉంటుంది. రేషియో ఒక్క టాపిక్ నేర్చుకోవడం ద్వారా...అందులో మిగిలిన మరో మూడు టాపిక్స్ ను సులభంగా చేయవచ్చు. ఇక టైం సిరీస్ లో మరో మూడు టాపిక్స్ ఉంటాయి. టైం., ఎఫిసీఎంసీ., వర్క్ అనేవి టైం సిరీస్ లో భాగం. ఈ మూడు టాపిక్స్ నేమ్స్ మార్చుకుంటూ ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి. పైన చెప్పిన మూడు కాన్సెప్ట్స్ ను మూడు బ్లాకులుగా డివైడ్ చేసి నేర్చుకుంటే మంచిది. మోడల్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్కులు రావు.... కేవలం ఆరిజిన్ టాపిక్స్ ని మంచిగా చదువుకుంటే చాలు.

  IBPS Clerk Exam English Tips: ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..
  ఐబీపీఎస్ పరీక్షా రీజనింగ్: 

  రీజనింగ్ లో ముందుగా మనము రీజనింగ్ ఎబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఎనభై శాతం పజ్జిల్స్ చదువుకుంటే రీజనింగ్ లో స్కోరింగ్ బాగా వస్తుంది. ఈ పజిల్స్ ను కొందరు 2 నిమిషాల్లో మరికొందరు 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తుంటారు. కానీ పజిల్స్ మనం ప్రశ్న చదువుతున్నా సమయంలోనే అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే టైం కలసి వస్తుంది. పజిల్స్ 20నుంచి 25మార్కుల వారికు వచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్స్ కోసం పజిల్స్ ను లోతుగా అధ్యాయం చేస్తూ చదువుకోవాలి. ఇనిక్వాలిటిస్., శిలాజిజమ్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్ మరి కొన్ని టాపిక్స్ గా ఉంటాయి.


  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank exams, IBPS, JOBS

  ఉత్తమ కథలు