IBPS BANK CLERK EXAM NOW IN REGIONAL LANGUAGES APPLICATIONS TO RESUME OCT 7 KNOW DETAILS EVK
IBPS Clerk : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలుగులో ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)
ఐబీపీఎస్ (IBPS) క్లర్ పరీక్ష ఇక ప్రాంతీయ భాషల్లో రాసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఐబీపీఎస్ పరీక్ష తెలుగులోనే రాయొచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఐబీపీఎస్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిలిచిన దరఖాస్తు ప్రక్రియ తిరగి ప్రారంభమైంది.
ఐబీపీఎస్ (IBPS) క్లర్క్ పరీక్ష ఇక ప్రాంతీయ భాషల్లో రాసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఇకపై తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఐబీపీఎస్ పరీక్ష తెలుగులోనే రాయొచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలయైన . ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్- XI (IBPS CRP-XI) పరీక్ష తెలుగులోనే రాయొచ్చు. ఈ పరీక్షకు అక్టోబర్ 7, 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది జూలైలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచింది. తాజా ఉత్తర్వులతో తిరిగి ప్రారంభం కానుంది.
ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. నోటిఫికేషన్ (Notification) విడుదలైన సమయంలో అంటే జూలై 12 నుంచి 14వ తేదీల మధ్య రిజిస్టర్ చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ) విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఈ పరీక్షలే కాకుండా SSC, RRB, మరియు IBPS ద్వారా నిర్వహించే నియామక పరీక్షలతో సహా అనేక పోస్టులకు సాధారణ నియామక పరీక్షలను నిర్వహించే ఒక జాతీయ నియామక సంస్థ (NRA) ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. సంవత్సరానికి రెండుసార్లు జరిగే అన్ని పోస్టులలో నియామకానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) ఉంటుంది. విద్యా అర్హతల ఆధారంగా ప్రతి ఒక్కరికి వేర్వేరు CET లు ఉంటాయి. CET 12 ప్రాంతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌లో కూడా నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు..
బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లర్క్ 11 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,830 క్లర్క్ పోస్టులు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ https://www.ibps.in/ లో తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 263, తెలంగాణలో 263 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
తాజా తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభ తేదీ
అక్టోబర్ 7, 2021
దరఖాస్తు చివరి తేదీ
అక్టోబర్ 27, 2021
ప్రిలిమ్స్ ఎగ్జామ్
డిసెంబర్, 2021
ప్రిలిమ్స్ ఫలితాలు
డిసెంబర్, 2021 / జనవరి, 2022
మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు
జనవరి, 2022
మెయిన్ ఎగ్జామ్
జనవరి / ఫిబ్రవరి 2022
ప్రొవిజనల్ అలాట్మెంట్
ఏప్రిల్, 2022
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.