Home /News /jobs /

IBPS BANK CLERK EXAM DATES OUT KNOW EXAM PATTERN AND PREPARATION PLAN EVK

IBPS Clerk 2021 : ఇలా చేస్తే బ్యాంక్ కొలువు మీదే.. ఐబీపీఎస్ ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

IBPS Clerk Preparation Tips : బ్యాంక్ ఉద్యోగం అనేది చాలా మంది క‌ల‌.. ఆ క‌ల నెర‌వేర్చు కోవ‌డానికి మంచి అవకాశం వచ్చేసింది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 7,855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష విధానం ఐబీపీఎస్ క్ల‌ర్క్ సెల‌బ‌స్ (ibps clerk syllabus) ఎలా ఉంటుంది. ఎలా ప్రిపేర్ అయితే జాబ్ సాధించ‌వ‌చ్చో పూర్తి ప్రిప‌రేష‌న్ ప్లాన్ వివ‌రాలు.

ఇంకా చదవండి ...
  బ్యాంక్ ఉద్యోగం అనేది చాలా మంది క‌ల‌.. ఆ క‌ల నెర‌వేర్చు కోవ‌డానికి మంచి అవకాశం వచ్చేసింది. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 7,855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేసేందుకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 333, ఆంధ్రప్రదేశ్‌లో 387  క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఈ ఏడాది జూలైలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాంతీయ భాషల్లో (Region Languages) పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ కార‌ణంగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ నిలిచింది. తాజా ఉత్త‌ర్వులతో తిరిగి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీ. అంతే కాకుండా ఐబీపీఎస్ (IBPS) క్ల‌ర్క్‌ ప‌రీక్ష ఇక ప్రాంతీయ భాష‌ల్లో రాసే వెసులుబాటును కేంద్రం క‌ల్పించింది. ఇక‌పై తెలుగు రాష్ట్రాల్లోని అభ్య‌ర్థులు ఐబీపీఎస్ ప‌రీక్ష తెలుగులోనే రాయొచ్చు.

  ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది ఐబీపీఎస్‌ సీఆర్‌పీ క్లర్క్- XI (IBPS CRP-XI) ప‌రీక్ష తెలుగులోనే రాయొచ్చు. ఇది నిరుద్యోగుల‌కు మంచి అవ‌కాశంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ప‌రీక్ష ఎలా నిర్వ‌హిస్తారు. ఎలా స‌న్న‌ద్ధం కావాలో తెలుసుకోండి. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో చ‌దివితే ఈ ఉద్యోగం సాధించ‌డం క‌ష్టం కాదు.

  ఎంపిక ప్ర‌క్రియ రెండు ద‌శ‌ల్లో ఉంటుంది..
  ఐబీపీఎస్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల (Written Test) విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్‌ రెండూ ఆబ్జెక్టివ్‌ (Objective) విధానంలో ఉంటాయి. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.

  ప్రిలిమినరీ పరీక్ష
  అభ్యర్థులకు ముందుగా ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam)ను నిర్వహిస్తారు. ఇది గంట వ్య‌వ‌ధితో 100 ప్ర‌శ్న‌లకు స‌మాధానం ఇవ్వాలి.

  విభాగంప్ర‌శ్న‌లుమార్కులుస‌మ‌యం
  న్యూమెరిక‌ల్ ఎబిలిటీ353520 నిమిషాలు
  రీజ‌నింగ్‌353520 నిమిషాలు
  ఇంగ్లీష్‌303020 నిమిషాలు
  మొత్తం10010060 నిమిషాలు

  మెయిన్ ప‌రీక్ష విధానం..
  ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది చొప్పున మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్‌ పరీక్ష కూడా ఆన్‌లైన్‌ (Online) విధానంలోనే జరుగుతుంది. మెయిన్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది.  విభాగంప్ర‌శ్న‌లుమార్కులుస‌మ‌యం
  జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌/ ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌505035 నిమిషాలు
  రీజ‌నింగ్ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌506045 నిమిషాలు
  కాంపిటేటీవ్ ఆప్టిట్యూడ్‌505045 నిమిషాలు
  ఇంగ్లీష్‌404035 నిమిషాలు
  మొత్తం200100160 నిమిషాలు

  ఎలా ప్రిపేర్ అవ్వాలి..
  - ముందు నుంచే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు క‌లిసి ప్రిపేర్ అవ్వాలి.
  - స‌న్న‌ద్ధ‌త‌కు రోజు క‌నీసం 6 నుంచి 10 గంట‌ల స‌మ‌యం కేటాయించాలి.
  - మొత్తం ఒకే స‌బ్జెక్టు చ‌ద‌వ‌కుండా.. వాటిని విభ‌జించుకోవాలి.
  - మీకు క‌ఠిన‌మైన స‌బ్జెక్టుకు క‌నీసం 2 గంట‌ల స‌మ‌యం ఎక్కువ‌గా కేటాయించాలి.
  - కొత్తగా ప్రిప‌రేష‌న్ ప్రారంభించేవారు కూడా భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు 20 నుంచి 25 రోజుల్లో కృషి చేస్తే స‌బ్జెక్టుపై ప‌ట్టు సాదించ‌వ‌చ్చు.
  - ముందు ప్రిప‌రేష‌న్‌లో క‌చ్చిత‌త్వం (Accuracy) అభ్యాసం చేయాలి.
  - క‌చ్చితత్వం అనంత‌రం వేగం పెంచాలి.
  - స‌బ్జెక్టు మాత్ర‌మే కాకుండా రోజు మోడ‌ల్ పేప‌ర్ ప్రాక్టీస్ చేయాలి.

  UPSC Recruitment 2021 : యూపీఎస్సీలో 56 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకోండి


  ప‌రీక్షలో ఏం వ‌స్తాయి.. ఎం చ‌ద‌వాలి
  బ్యాంక్ ప‌రీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థులు ముందుగా ప్ర‌తీ విభాగంలో పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వాలి. మూడు విభాగాల్లో క‌నీస మార్కులు వ‌చ్చిన వారివి మాత్ర‌మే మెరిట్ స్కోర్‌ను ప‌రిగ‌నిస్తారు.

  ఇంగ్లీష్ - త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ స్కోర్ చేసే అవ‌కాశం
  - ఈసారి ప‌రీక్ష తెలుగులో రాసినంత మాత్రాన ఇంగ్లీష్ ప్రాముఖ్య‌త మ‌ర‌వొద్దు.
  - ఈ విభాగంలో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు..
  - ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ (Communication Skills)ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి.
  - ఇడియమ్స్,సెంటెన్స్‌ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్‌ ఇం గ్లి (General English) నైపుణ్యం పెంచుకోవాలి.
  - ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్‌ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి.

  న్యూమరికల్‌ ఎబిలిటీ - క‌చ్చిత‌త్వం ముఖ్యం
  - ప్రిలిమ్స్‌లో నిర్వ‌హించే న్యూమరికల్‌ ఎబిలిటీ (Numerical Ebility) మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని గుర్తించ‌వ‌చ్చు.
  - ప్రధానంగా అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్‌ చేయాలి.
  - వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి.

  AICTE Scholarship 2021 : నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండిలా


  రీజనింగ్ - అనాలిసిస్ ప్రధానం..
  - ఈ విభాగం ఇది కూడా రెండు దశల్లోనూ(ప్రిలిమ్స్, మెయిన్స్‌) ఉంటుంది.
  - ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ (Practice) చేయాలి.
  - లా ప్రిలిమ్స్‌ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది.

  ఈ మూడు స‌బ్జెక్టులు కాకుండా మెయిన్‌లో మ‌రో రెండు స‌బ్జెక్టులు ఉంటాయి.

  జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌
  తాజా బ్యాంకింగ్‌ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్‌ (Banking) రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.

  SBI Scholarship : విద్యార్థుల‌కు ఎస్‌బీఐ చేయూత‌.. రూ.38,500 స్కాల‌ర్‌షిప్‌ అందుకోవ‌చ్చు


  కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌
  కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేషన్‌ (Computer Operations) సిస్టమ్స్, కంప్యూటర్‌ స్ట్రక్చర్, ఇంటర్నెట్‌ (Internet) సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్‌ డిస్క్‌ తదితర) గురించి తెలుసుకోవాలి.

  ప్రీవియస్‌ పేపర్స్, మాక్‌ టెస్ట్స్‌
  గత ప్రశ్న పత్రాల సాధన, మాక్‌ టెస్ట్‌ (Mock Test) లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్‌ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్‌ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది.

  ముఖ్య‌మైన స‌మాచారం..  
  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ తిరిగి ప్రారంభ తేదీ :  అక్టోబర్ 7, 2021
  దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 27, 2021
  ప్రిలిమ్స్ ఎగ్జామ్ :  డిసెంబర్, 2021
  ప్రిలిమ్స్ ఫలితాలు :  డిసెంబర్, 2021 /  జనవరి, 2022
  మెయిన్స్ ప‌రీక్ష హాల్ టికెట్లు : జనవరి, 2022
  మెయిన్ ఎగ్జామ్ :  జనవరి / ఫిబ్రవరి 2022
  ప్రొవిజనల్ అలాట్‌మెంట్ :  ఏప్రిల్, 2022
  అధికారి వెబ్‌సైట్  :  https://ibps.in/
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bank Jobs 2021, CAREER, Exams, Govt Jobs 2021, IBPS, Job notification

  తదుపరి వార్తలు