IARI RECRUITMENT 2022 INDIAN AGRICULTURAL RESEARCH INSTITUTE RELEASED JOB NOTIFICATION FOR 641 POSTS KNOW VACANCIES IN HYDERABAD SS
IARI Recruitment 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 641 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో కూడా ఖాళీలు
IARI Recruitment 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 641 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో కూడా ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)
IARI Recruitment 2022 | కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు (ICAR) చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 641 ఖాళీలను ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్స్‌లో 25 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 డిసెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 10 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల గురించి తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
Step 1- అభ్యర్థులు https://www.iari.res.in/ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో టెక్నీషియన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
Step 2- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. నియమనిబంధనలన్నీ చదివి PROCEED TO REGISTER పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత పోస్టు పేరు సెలెక్ట్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 6- విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 7- ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.