Home /News /jobs /

IAF RECEIVES OVER 94000 APPLICATIONS FOR AGNIVEER IN 3 DAYS UMG GH

Agniveer Vayu: అగ్నిపథ్‌కు భారీ స్పందన.. మూడు రోజుల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా..!

అగ్నివీర్ల అప్లికేషన్స్

అగ్నివీర్ల అప్లికేషన్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరు (Agniveer)ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. నోటిఫికేషన్ (Notification) రిలీజ్ అయిన మూడు రోజులలోపే సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే. కొందరు ఆర్మీ ఔత్సాహిక అభ్యర్థులు అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో రైల్వేశాఖకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఆ వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) అగ్నిపథ్ పథకం (Agnipath) కింద అగ్నివీరుల నియామకం కోసం నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన మూడు రోజులలోపే సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 27 నాటికి 94,281 అప్లికేషన్లు వచ్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ careerindianairforce.cdac.in ద్వారా జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నాలుగేళ్ల సర్వీస్
కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ కింద సాయుధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలానికి సైనికులను రిక్రూట్ చేసుకోనున్నారు. సర్వీస్ పూర్తయిన తర్వాత, వీరిలో నాలుగింట ఒక వంతు మందిని రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. మిగతా వారిని రిలీవ్ చేసి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తారు.

అర్హత ప్రమాణాలు
అగ్నిపథ్ పథకం ద్వారా ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఈ ఏడాది గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు సడలించారు. అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌మెంట్‌కు అర్హత పొందాలంటే, అభ్యర్థి 12వ తరగతి లేదా అందుకు సమానమైన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు సాధించడం కూడా తప్పనిసరి. COBSE-లిస్టెడ్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ లేదా కౌన్సిల్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో కూడా 50 శాతం మార్కులు తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ
అగ్నివీర్ వాయు ఎంపిక ప్రక్రియలో ముందు జూలై 24న అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్ట్ కోసం ఆహ్వానిస్తారు.

జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి సంవత్సరం వేర్వేరుగా నెలవారీ ప్యాకేజీ లభిస్తుంది. ఈ ప్యాకేజీలో 70 శాతం వేతనంగా చేతికి అందుతుంది. మిగిలిన 30 శాతం నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత అభ్యర్థులకు ఇచ్చే అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ అవుతుంది. మొదటి సంవత్సరానికి, అభ్యర్థులకు నెలకు రూ.30,000 ప్యాకేజీ చెల్లిస్తారు. ఇక్కడ ఇన్-హ్యాండ్ జీతం రూ. 21,000గా ఉంటుంది. మిగిలిన 9వేలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ అవుతుంది. రెండో సంవత్సరంలో ప్యాకేజీ రూ. 33,000 కాగా, చేతికి అందే జీతం రూ. 23,100. ఇక మూడు, నాలుగు సంవత్సరాల్లో అగ్నివీరులకు నెలవారీ ప్యాకేజీగా రూ.36,500, రూ.40,000గా ఉంటుంది. చేతికి వచ్చే జీతం వరుసగా రూ. 25,550, రూ. 28,000గా నిర్ణయించారు.
Published by:Mahesh
First published:

Tags: Agnipath Scheme, Army jobs, Indian Air Force, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు