నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 255 ఖాళీలున్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత నోటిఫికేషన్‌లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
NTA Recruitment 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జాబ్స్.. దరఖాస్తుకు 3 రోజులే గడువు
Telangana Post Office Jobs: తెలంగాణలోని పోస్ట్ ఆఫీసుల్లో 1150 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రాసెస్ ఇదే
మొత్తం ఖాళీలు- 255
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
హౌజ్ కీపింగ్ స్టాఫ్
మెస్ స్టాఫ్
లోయర్ డివిజన్ క్లర్క్
క్లర్క్ హిందీ టైపిస్ట్
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2
స్టోర్ (సూపరింటెండెంట్)
స్టోర్ కీపర్
లాండ్రీమ్యాన్
ఆయా
కార్పెంటర్
పెయింటర్
వల్కనైజర్
సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్
కుక్
ఫైర్‌మ్యాన్
Common Eligibility Test: రైల్వే ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కు సెట్... పరీక్ష వివరాలు ఇవే
4 Day Work: వారానికి 4 రోజులు డ్యూటీ... 3 రోజులు వీకాఫ్... అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం
దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 13
పరీక్ష తేదీ- 2021 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు.
వేతనం- లెవెల్ 1 పోస్టుకు రూ.18,000, లెవెల్ 2 పోస్టుకు రూ.19,900, లెవెల్ 4 పోస్టుకు రూ.25,500
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.