హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)

IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్... హైదరాబాద్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

IAF Group C Recruitment 2021 | టెన్త్ పాసయ్యారా? ఇంటర్ పూర్తి చేశారా? డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,524 పోస్టుల్ని ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌లో కూడా ఖాళీలున్నాయి. స్టెనోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కార్పెంటర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 మే 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF అధికారిక వెబ్‌సైట్ https://indianairforce.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

IAF Group C Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 1,524

వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 362

సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్- 28

ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్- 132

సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్- 116

మెయింటనెన్స్ కమాండ్ యూనిట్- 479

ట్రైనింగ్ కమాండ్ యూనిట్- 407

Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Bank Jobs 2021: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IAF Group C Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 3

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 2

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

ఎంపిక విధానం- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ లాంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషలో ఉంటుంది. మెరిట్, కేటగిరీ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఉంటాయి.

NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Common Eligibility Test: రైల్వే జాబ్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే


IAF Group C Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Employment News లేదా Rozgar Samachar వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మాట్ ఉంది.

అభ్యర్థులు ఇదే ఫార్మాట్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

ఎన్వలప్‌పైన APPLICATION FOR THE POST OF -------- AND CATEGORY-------- అని రాయాలి.

నోటిఫికేషన్‌లో యూనిట్ వారీగా పోస్టల్ అడ్రస్‌లు వేర్వేరుగా ఉన్నాయి.

అభ్యర్థులు ఏ యూనిట్‌కు దరఖాస్తు చేస్తే ఆ యూనిట్ పోస్టల్ అడ్రస్‌కే దరఖాస్తు ఫామ్ పంపాలి.

దరఖాస్తు ఫామ్ 2021 మే 2 లోగా సదరు పోస్టల్ అడ్రస్‌కు చేరేలా అప్లికేషన్స్ పంపాలి.

First published:

Tags: CAREER, Exams, Govt Jobs 2021, Indian Air Force, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు