ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు, యూనిట్స్‌లో గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, పెయింటర్, సూపరింటెండెంట్ లాంటి పోస్టుల్ని (Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 174 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ వరకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా అప్లికేషన్స్ పంపాలి.
మొత్తం ఖాళీలు | 174 |
కార్పెంటర్ (ఎస్‌కే) | 3 |
కుక్ | 23 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 103 |
హౌజ్ కీపింగ్ స్టాఫ్ | 23 |
లోయర్ డివిజన్ క్లర్క్ | 10 |
స్టోర్ కీపర్ | 6 |
పెయింటర్ | 2 |
సూపరింటెండెంట్ (స్టోర్) | 3 |
మెస్ స్టాఫ్ | 1 |
కార్పెంటర్ (ఎస్‌కే)- టెన్త్ పాస్ కావడంతో పాటు కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
కుక్- టెన్త్ పాస్ కావడంతో పాటు కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- టెన్త్ పాస్ కావాలి.
హౌజ్ కీపింగ్ స్టాఫ్- టెన్త్ పాస్ కావాలి.
లోయర్ డివిజన్ క్లర్క్- ఇంటర్మీడియట్ పాస్ కావాలి. నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు, 30 హిందీ పదాలు టైప్ చేయాలి.
స్టోర్ కీపర్- ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
పెయింటర్- టెన్త్ పాస్ కావడంతో పాటు పెయింటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
సూపరింటెండెంట్ (స్టోర్)- గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
మెస్ స్టాఫ్- టెన్త్ పాస్ కావాలి.
UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో జాబ్స్... ఎలా అప్లై చేయాలంటే
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 2
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష.
Step 1- ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2- నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది.
Step 3- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
Step 4- నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
Step 5- వేర్వేరు స్టేషన్స్, యూనిట్స్‌కి వేర్వేరు అడ్రస్‌లు ఉన్నాయి.
Step 6- అభ్యర్థులు ఆ సంబంధిత అడ్రస్‌కు మాత్రమే అప్లికేషన్స్ పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Air Force, Job notification, JOBS