ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) ద్వారా అభ్యర్థులను కోర్సులకు ఎంపిక చేసి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఏఎఫ్. ఫ్లయింగ్ బ్రాంచ్, పర్మనెంట్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా ఈ కోర్సుల్ని నిర్వహిస్తోంది. 2023 జనవరిలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 317 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. అదే రోజున https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. నోటిఫికేషన్ అప్‌లోడ్ అవుతుంది. అప్లై చేయడానికి డిసెంబర్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి. పూర్తి వివరాలను https://careerindianairforce.cdac.in లేదా https://afcat.cdac.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.
Southern Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
మొత్తం ఖాళీలు | 317 |
ఎస్ఎస్‌సీ | 77 |
ఏఈ | 129 |
అడ్మిన్ | 51 |
ఏసీసీటీఎస్ | 21 |
ఎల్‌జీఎస్ | 39 |
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 2,213 ఉద్యోగాలు... రూ.53,500 వరకు వేతనం
దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 1 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 30
కోర్సు ప్రారంభం- 2023 జనవరి
శిక్షణా కాలం- గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్‌కు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కు 52 వారాలు.
విద్యార్హతలు- అభ్యర్థులు 12వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎగ్జామ్ పాస్ కావాలి. రెండు సబ్జెక్ట్స్‌లో కనీసం 50 శాతం చొప్పున మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 2023 జనవరి 1 నాటికి ఫ్లై బ్రాంచ్ అభ్యర్థులకు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 20 నుంచి 26 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.250.
వేతనం- రూ.56,100 నుంచి రూ.1,77,500.
ఎంపిక విధానం- రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ముందుగా https://afcat.cdac.in/AFCAT/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో డిసెంబర్ 1న నోటిఫికేషన్ అప్‌లోడ్ అవుతుంది. దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది.
Step 3- నోటిఫికేషన్ చదివిన తర్వాత అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్టర్ చేయాలి.
Step 5- లాగిన్ చేసిన తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 6- ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 7- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 8- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, IAF, Indian Air Force, Job notification, JOBS