హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: అప్పుడు కెమిస్ట్రీలో 24 మార్కులు... ఇప్పుడు కలెక్టర్... ఓ ఐఏఎస్ రియల్ స్టోరీ

Success Story: అప్పుడు కెమిస్ట్రీలో 24 మార్కులు... ఇప్పుడు కలెక్టర్... ఓ ఐఏఎస్ రియల్ స్టోరీ

Success Story: అప్పుడు కెమిస్ట్రీలో 24 మార్కులు... ఇప్పుడు కలెక్టర్... ఓ ఐఏఎస్ రియల్ స్టోరీ
(ప్రతీకాత్మక చిత్రం)

Success Story: అప్పుడు కెమిస్ట్రీలో 24 మార్కులు... ఇప్పుడు కలెక్టర్... ఓ ఐఏఎస్ రియల్ స్టోరీ (ప్రతీకాత్మక చిత్రం)

IAS Nitin Sangwan Marksheet | పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని బాధపడుతున్నారా? తక్కువ మార్కులు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అయితే ఈ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

ఇవాళ సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. రెండు రోజుల క్రితం సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు అయ్యో తమ లైఫ్ ఇంతేనా అని బాధపడుతున్నారు. తక్కువ మార్కులు వచ్చినవారు ఇంకొన్ని మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. కానీ జీవితంలో సక్సెస్ సాధించాలని 90 శాతమో, 100 శాతమో మార్కులు రావాల్సిన అవసరం లేదు. కష్టపడటం, అంకిత భావంతో పనిచేయడం లాంటివి తెలిస్తే చాలు. మార్కులతో సంబంధం లేదు. జీవితంలో రాణించొచ్చు. తమకు అభిరుచి ఉన్న రంగాలను ఎంచుకుంటే కెరీర్‌లో దూసుకెళ్లొచ్చు. ఇలాంటి స్ఫూర్తినిచ్చే మాటలు చదవడానికి, వినడానికి బాగుంటాయని అనుకోవద్దు. ఓసారి ఈ ప్రపంచంలో చూస్తే చదువులో ఏమాత్రం రాణించలేనివారు కూడా కెరీర్‌లో ఉన్నతమైన స్థానాల్లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఐఏఎస్ నితిన్ సంగ్వాన్‌ కథ కూడా అలాంటిదే. 2002 నాటి తన మార్క్స్ షీట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు నితిన్ సంగ్వాన్. ప్రస్తుతం ఐఏఎస్ నితిన్ సంగ్వాన్ ట్వీట్ వైరల్‌గా మారింది. మార్కుల కోసం తపిస్తున్నవారి కళ్లు తెరిపిస్తోంది.

Top 10 Jobs: ఈ టాప్ 10 జాబ్స్‌కి ఫుల్ డిమాండ్... నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవే

Railway Course: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ కోర్సులు చేయండి

నితిన్ సంగ్వాన్... ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. ఐఐటీలో చదివారు. ఐఐటీలో చదివి, ఐఏఎస్ అధికారిగా మారారంటే స్కూల్ స్టడీస్‌లో కూడా ఫస్టేనని మీరనుకుంటే పొరపాటే. ఆయనకు సీబీఎస్ఈ 12వ తరగతిలో కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? కేవలం 24 మార్కులు. ఆ సబ్జెక్ట్‌లో 23 మార్కులు వస్తే పాస్. ఆయనకు 1 మార్కు మాత్రమే ఎక్కువ వచ్చింది. ఇదంతా జరిగింది 2002 లో. ప్రస్తుతం అందరూ 90 శాతం, 100 శాతం మార్కుల వెంట పరిగెడుతున్నారు. కానీ మార్కులు తన జీవితాన్ని డిసైడ్ చేయలేదంటున్నారు నితిన్ సంగ్వాన్. తాను తన జీవితంలో ఏం కావాలనుకున్నానో దానికి ఈ తక్కువ మార్కులు అడ్డంకి కాదని చెబుతున్నారు. బోర్డు పరీక్షల్లో అంత తక్కువ మార్కులు వచ్చినా ఆ తర్వాత ఐఐటీలో ఎంబీఏ చదివి, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించి, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి 26వ ర్యాంక్ తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

పిల్లలపై మార్కుల భారం మోపొద్దని, బోర్డు రిజల్ట్స్ కంటే జీవితం చాలా ఎక్కువని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హితబోధ చేశారు. పరీక్షల ఫలితాలు ఆత్మపరిశీలన కోసం తప్ప విమర్శల కోసం కాదన్నారు.

First published:

Tags: 10th Class Exams, 10th class results, CAREER, CBSE, EDUCATION, Exams, Results, Ssc exams, VIRAL NEWS

ఉత్తమ కథలు