Hyderabad University Admissions 2021: హెచ్​సీయూలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

ప్రతీకాత్మక చిత్రం

గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ)లో 2021–22 ఏడాదికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది.

  • Share this:
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ)లో 2021–22 ఏడాదికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 21 నుంచి జూలై 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది. ప్రవేశ పరీక్షల ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్​ పీజీ, పీజీ, ఎంటెక్​, పీహెచ్​డీ ప్రోగ్రామ్స్​లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలు 2021 ఆగస్టు / సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతాయి. అయితే, ఏదైనా కోర్సుకు 300 కన్నా తక్కువ దరఖాస్తులు వస్తే ప్రవేశ పరీక్షను నిర్వహించకుండానే అడ్మిషన్లు కల్పిస్తామని యూనివర్సిటీ పేర్కొంది. ఈ ప్రవేశపరీక్షల ద్వారా హెచ్​సీయూలోని 117 కోర్సులకు 2,328 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 46 పిజి కోర్సులు, 10 ఎంటెక్, 44 పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. హెచ్​సీయూ ఈ సంవత్సరం నుండి మూడు కొత్త కోర్సులను కూడా ప్రారంభించింది. MTech (మోడలింగ్ అండ్​ సిమ్యూలేషన్​), MPA (మ్యూజిక్​), పబ్లిషింగ్​లో సర్టిఫికేట్ కోర్సులను కొత్తగా ప్రారంభించింది.

కొత్తగా మూడు కోర్సులు..
కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే ఇతర టెస్ట్​ స్కోర్ల ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని హెచ్​సీయూ తెలిపింది. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసిఎ) కోర్సులో ప్రవేశాలకు NIMCET స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటారు. ఇక, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్​ ఆధారంగా ఎంటెక్ (సిసిఎంటి)లో ప్రవేశాలు కల్పిస్తారు. మరోవైపు, సెంట్రలైజ్​డ్​ కౌన్సెలింగ్ ద్వారా తొమ్మిది ఎంటెక్​ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) కోర్సులో ప్రవేశం కొరకు సెంట్రల్ సీట్​ అలకేషన్​ బోర్డ్​ (సిఎస్‌ఎబి) జేఈఈ స్కోర్​ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

మరోవైపు, జాతీయ స్థాయిలో నిర్వహించే CAT స్కోరు ఆధారంగా MBA కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. MSC బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశాలను RCB ఫరీదాబాద్ ఏటా నిర్వహించే GAT–B ద్వారా భర్తీ చేస్తారు. కాగా, ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన MTech (మోడలింగ్ మరియు సిమ్యూలేషన్​) కోర్సు ప్రవేశాలను GATE స్కోర్‌ ద్వారా చేపడతారు.
Published by:Sumanth Kanukula
First published: