Home /News /jobs /

HYDERABAD POLICE CONDUCTING JOB MELA ON DEC 21 FOR 2000 JOB VACANCIES IN 20 COMPANIES HERE DETAILS NS

Hyderabad Police Job Mela: హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 20 కంపెనీల్లో 2000+ జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 20 కంపెనీల్లో 2000+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ ఇలా..

హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా.. 20 కంపెనీల్లో 2000+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ ఇలా..

హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) ఈ నెల 21 భారీ జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. 2000లకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ పోలీసులు (Telangana Police) కేవలం శాంతిభద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా అనేక సమాజ సేవా కార్యక్రమల్లోనే కాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లోనూ ముందు ఉంటున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ ఉద్యోగాలకు (Police Jobs) శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తూ ప్రముఖ కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) హైదరాబాద్ లో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 21న హైదరాబాద్ నాంపల్లి లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జాబ్ మేళాను సెంట్రల్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 20 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 2 వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

    జాబ్ మేళాలో పాల్గొననున్న కంపెనీలు:
    జాబ్ మేళాలో TMI Group. HDFC Bank Ltd, Axis Bank, Airtel, Act Fibernet, Vi Vodafone Idea Limited, Apollo Pharmacies Ltd తో పాటు మొత్తం 20 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనున్నాయి.
    Jobs in Telangana: హైదరాబాద్ NIMSలో ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. ఇలా అప్లై చేయండి



    UPSC Recruitment 2021: ఆ ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో ఐదు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
    రిజిస్ట్రేషన్ ఇలా..

    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఈ లింక్ పై క్లిక్ చేసిన అనంతరం పేరు, జెండర్, వయస్సు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా, విద్యార్హత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.


    జాబ్ మేళా నిర్వహించు వేధిక: జాబ్ మేళాను Red Rose Palace Function Hall, Chapel Road, Opp. Public Garden, Nampally, Hyderabad-500001. చిరునామాలో నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad police, Job Mela, Private Jobs, Telangana, Telangana Police

    తదుపరి వార్తలు