Home /News /jobs /

HYDERABAD NEWS SOFTWARE COMPANIES MAY BE OPEN FROM MAY 7 BS

మే 7 నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఓపెన్..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ దెబ్బకు మూతపడ్డ సాఫ్ట్‌వేర్ కంపెనీలు మే 7 నుంచి తెరుచుకోనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఉద్యోగులు విధులకు హాజరు కావాలని యాజమాన్యాల నుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం.

    లాక్‌డౌన్ దెబ్బకు మూతపడ్డ సాఫ్ట్‌వేర్ కంపెనీలు మే 7 నుంచి తెరుచుకోనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఉద్యోగులు విధులకు హాజరు కావాలని యాజమాన్యాల నుంచి మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. కొంతమందిని వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తూనే, మరికొంత మందిని ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పంపినట్లు తెలిసింది. రెడ్ జోన్ మినహా మిగత జోన్లలో ఉంటున్న ఉద్యోగులు హాజరు కావాలని చెప్పినట్లు సమాచారం. అది కూడా పరిమిత సంఖ్యలోనే కార్యాలయాలకు రావాలని చెప్పాయట. ముఖ్యంగా కీలక శాఖల్లో పనిచేస్తున్న వారిని యాజమాన్యాలు ఆఫీసులకు పిలిపిస్తున్నాయట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఆఫీస్ పని వేళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. అందుకు ప్రభుత్వ అనుమతి కూడా వచ్చినట్లు సమాచారం.

    ఉద్యోగులు హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యాలయాలన్నీ శానిటైజ్ చేసి ఉంచినట్లు తెలిసింది. ఉద్యోగులు సొంత వాహనాల్లోనే ఆఫీస్‌కు రావాలని యాజమాన్యాలు కోరాయట. విధులకు హాజరయ్యే ఉద్యోగుల నుంచి సమాచారం తీసుకునేందుకు ఆయా సంస్థలు 20 ప్రశ్నలతో కూడిన నమూనాను కూడా సిద్ధం చేసి, వాటిని ఉద్యోగులకు మెయిల్ చేశారట. ఆ సమాచారాన్ని బట్టి ఉద్యోగులు ఎంత మంది ఆఫీస్‌కు రావాలి? ఎంత మంది ఇంటి వద్ద నుంచి పని చేయాలి? అన్న నిర్ణయం తీసుకోనున్నారు. క్యాంటీన్లను మూసేసి.. ఇంటి వద్ద నుంచే భోజనం, స్నాక్స్ తెచ్చుకొనేలా, ఆఫీస్‌కు వచ్చేప్పుడు.. శానిటైజర్, ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజ్‌లు ధరించేలా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Hyderabad, Information Technology, JOBS

    తదుపరి వార్తలు