Home /News /jobs /

HYDERABAD DMHO HAS RELEASED A NOTIFICATION FOR FILLING VARIOUS POSTS SALARY MORE THAN 50 THOUSAND APPLY LIKE THIS VB

Jobs In Hyderabad: హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా నియామకం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs In Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో(DMHO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఖాళీలను పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనున్నారు. ఆ వివరాలిలా..

తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో(DMHO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేశారు. ఈ ఖాళీలను పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మొత్తం ఖాళీలు 07 పోస్టులు. మెడికల్ ఆఫీసర్(Medical Officer), ఫిజీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన ప్రకటన 22 జూలై 22న విడుదల చేశారు. అయితే వీటికి ఎలాంటి రాత పరీక్షను నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ తేదీ 27జూలై, 2022గా పేర్కొన్నారు. UPHCలలో పని చేయడానికి NHM/NUHM కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Indian Navy Recruitment: అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. మహిళలకు కూడా అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు..


పాలియేటివ్ కేర్ యూనిట్, MNJ క్యాన్సర్ హాస్పిటల్ లో పని చేయాల్సి ఉంటుంది. మల్టీ జోన్-II నుండి ఆసక్తిగల అర్హత గల అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు అప్లికేషన్ ఫారమ్ తో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు 27.07.2022న ఉదయం 10.30 గంటలకు లోపు DM&HO, హైదరాబాద్, మీటింగ్ హాల్, 4వ అంతస్తు, GHMC భవనం, ప్యాట్నీ, సికింద్రాబాద్ అడ్రస్ కు హాజరవ్వాల్సిందిగా పేర్కొన్నారు.



నోటిఫికేషన్ తో పాటు.. అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి www.hyderabad.telangana.gov.in ను సందర్శించి నోటీస్ అనే ఆప్షన్ లో రిక్య్రూట్ మెంట్ ను ఎంపిక చేసుకోవాలి. అందులో నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వయోపరిమితి
అభ్యర్థి వయస్సు 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

మెడికల్ ఆఫీసర్ పోస్టులు NHM/NUHM స్కీం కింద 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి నెలకు జీతం రూ. 52వేలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ లోని యూపీహెచ్సీలల్లో పని చేయాల్సి ఉంటుంది.

మెడికల్ ఆఫీసర్ ఫిజీషియన్ పోస్టులు Palliative Care Unit స్కీం కింద ఒక పోస్టు ఖాళీగా ఉంది. వీరికి నెలకూ జీతం రూ.60 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంటుంది. వీరు హైదరాబదద్ ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో పని చేయాల్సి ఉంటుంది.

అర్హత.. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పిజీషియన్ పోస్టులకు జనరల్ మెడిసిన్(MD) చేసి 3 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. జనరల్ మెడిసిన్(MD) అర్హత కలిగిన అభ్యర్థ లేని పక్షంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 3 ఏళ్ల పాటు వర్క్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Brand Hyderabad, Career and Courses, Dmho, Govt Jobs 2022, JOBS, Telangana

తదుపరి వార్తలు