హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. పరీక్షలు రాయకున్నా చేతికి పట్టా..

లాక్‌డౌన్‌ ప్రభావంతో హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకున్నా చేతికి పట్టా అందించేలా చర్యలు చేపట్టింది.

news18-telugu
Updated: April 17, 2020, 9:30 AM IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. పరీక్షలు రాయకున్నా చేతికి పట్టా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్‌ ప్రభావంతో హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకున్నా చేతికి పట్టా అందించేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఇష్టమైతే పరీక్షలు రాసే వెసులుబాటును కూడా కల్పించింది. వివరాల్లోకెళితే.. పీజీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలను ఐచ్ఛికం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన సెమిస్టర్లు, ఇంటర్నల్స్‌లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సగటు తీసి చివరి సెమిస్టర్‌ గ్రేడ్‌ పాయింట్లను ఇస్తుంది. అయితే, ఆ గ్రేడ్ల పట్ల విద్యార్థులు సంతృప్తి చెందకపోతే పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పొదిలె అప్పారావు అధ్యక్షతన అన్ని విభాగాల అధిపతులు, డీన్స్‌తో జరిగిన అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఒక వేళ పరీక్ష రాసినా, వర్సిటీ కేటాయించిన గ్రేడ్‌ కంటే తక్కువ వస్తే వర్సిటీ గ్రేడ్‌నే కొనసాగించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఒకవేళ వర్సిటీ గ్రేడ్ కన్నా పరీక్షలు రాస్తే ఎక్కువ గ్రేడ్ వస్తే దాన్నే కేటాయిస్తారు. వాస్తవానికి మే 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉన్నా.. వర్సిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం పరీక్షలు లేకుండానే విద్యార్థులు పట్టా అందుకోనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగదని, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లకు సమస్య ఉండదని వర్సిటీ పేర్కొంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 17, 2020, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading