HURL RECRUITMENT 2021 HINDUSTAN URVARAK AND RASAYAN LIMITED RELEASED JOB NOTIFICATION FOR 513 POSTS SS
HURL Recruitment 2021: నెలకు రూ.50,000 జీతంతో 513 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
HURL Recruitment 2021: నెలకు రూ.50,000 జీతంతో 513 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
HURL Recruitment 2021 | డిప్లొమా, బీటెక్, డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్-HURL మొత్తం 513 ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
హిందుస్తాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్-HURL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల జాయింట్ వెంచర్ ఇది. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 513 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://hurl.net.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 16
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఆగస్ట్ 16
విద్యార్హతలు- డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా పాస్ అయినవారు అర్హులు కాదు.
ఇతర నిబంధనలు- ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
వేతనం- ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3,00,000, ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,10,000, పదేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,90,000, పదిహేనేళ్ల అనుభవం ఉన్నవారికి రూ.5,80,000.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.