నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-National Eligibility Cum Entrance Test)- 2022ను జులై 17న నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA-National Testing Agency) నిర్వహించనుంది. పరీక్షకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతొ వైద్య అభ్యర్థులు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-National Eligibility Cum Entrance Test)- 2022ను జులై 17న నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA-National Testing Agency) నిర్వహించనుంది. పరీక్షకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో వైద్య అభ్యర్థులు ప్రవేశ పరీక్ష(Exams)లను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ ప్రిపరేషన్‌కు మరింత సమయం కావాలని విద్యార్థులు కోరుతున్నారు. దాదాపు 40 నుంచి 60 రోజులు వరకు పరీక్ష తేదీని వాయిదా వేయాలని సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సీయూఈటీ పరీక్షకు, నీట్‌కు ఎక్కువ దూరం లేదని.. సీయూఈటీకి హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నెలరోజుల నిరసనల తర్వాత, ఇప్పుడు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించాలని అభ్యర్థిస్తున్నారు.
సోషల్ మీడియాలో డిమాండ్లు
సోషల్ మీడియా వేదికగా చాలా మంది విద్యార్థులు తమ వాదనలు వినిపిస్తున్నారు. జేఈఈ మెయిన్‌ను రెండు విడతల్లో నిర్వహిస్తున్నారని, నీట్‌కు మాత్రం ఒక అవకాశమే కల్పిస్తున్నారని, తక్కువ సమయం ఉండటంతో సక్రమంగా సన్నద్దం కాలేపోయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతే.. మరో ఏడాదిపాటు వేచి ఉండాలని చెబుతున్నారు. నీట్‌ను ఆగస్టు లేదా సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించాలని విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)- 2022కు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్‌ను ఈ సంవత్సరం రెండు విడతలుగా నిర్వహిస్తున్నారని, నీట్లో మాత్రం విద్యార్థులకు ఒక్క అవకాశమే కల్పిస్తున్నారని తెలిపారు. పరీక్షకు తక్కువ సమయం ఉండటంతో.. సక్రమంగా రాయలేకపోయిన వారికి మరొక అవకాశం ఉండదని, అలాంటి విద్యార్థులు మరో సంవత్సర కాలం వేచి ఉండాల్సి వస్తోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా NEET 2021కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ముగిసిందని, దీని వలన విద్యార్థులు ప్రిపేర్ కావడానికి తక్కువ సమయం పడుతుందని గత సంవత్సరం డ్రాపర్లు చెప్పారు.
ఇదీ చదవండి: Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?
మోదీ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్
#PMOHelpNEETUGAspirants అనే హ్యాష్‌ట్యాగ్‌తో నీట్ ఆశావహులు ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ ఆఖరి మార్గం అని పేర్కొన్నారు. జూన్ మధ్యలో ముగిసిన CBSE 12వ తరగతి బోర్డు పరీక్షల కారణంగా, తమకు సన్నద్ధం కావడానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే లభించిందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇంకా జులైలో జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్నారు. CUET కూడా జులై 15న ప్రారంభమవుతుంది.
మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. తమ ఆశలన్నీ కోల్పోయామని చెబుతున్నారు. ట్విట్టర్ వేదికగా తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. #PMOHelpNEETUGAspirants #MODIJIdeferNEETUG #MODIJIextendNEEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌లతో.. ఓ విద్యార్థి.. ‘నేను ఒత్తిడిలో ఉన్నాను. నేను ఏం చేయాలి. కాంట్ రివైజ్!’ అని ట్వీట్ చేశాడు.
విద్యార్థులు నిరాహార దీక్షకు దిగుతామని ముందే చెప్పారు. పీఎం మోదీ నివాసం వైపు కవాతు ప్రారంభించాలని పేర్కొంటూ ఛలో మోదీ ఆవాస్ లేదా ‘మోదీ నివాసానికి వెళ్దాం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వారు సోషల్ మీడియా వేదికగా స్వరం వినిపిస్తున్నారు. ఈ సంవత్సరం, 18.72 లక్షల మంది విద్యార్థులు నీట్ 2022 కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సారితో పోలిస్తే 2.5 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. ఈసారి వయోపరిమితి కూడా తొలగించారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.