మరో భారీ జాబ్ నోటిఫికేషన్ కింద రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ఖాళీల వివరాలు
ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్టీ(మ్యూజిక్)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు
పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి. PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం
మొదట కేవీఎస్ అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.inను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో రిక్రూట్మెంట్పై క్లిక్ చేసి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అనంతరం అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోండి.
దరఖాస్తు రుసుము
అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే రూ.2300 ఫీజుగా చెల్లించాలి. పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్వో, హెచ్‌టీ పోస్టులకు రూ.1500.. ఎస్ఎస్ఏ, స్టెనో, జేఎస్ఏ పోస్టులకు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆబ్జెక్టివ్, క్వశ్చన్-బేస్డ్ రూపంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తంగా 180 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించనున్నారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Kvs, Teacher jobs