ఇండస్ట్రీ లీడింగ్ టెక్నాలజీస్‌పై ఉచిత ఆన్‌లైన్ ట్రైనింగ్ కోసం ‘హువావే ఇండియా’(Huawei India) జనరల్ ఐసీటీ కోర్సులను ప్రారంభించింది. 5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్(Net Work) కమ్యూనికేషన్స్, బిగ్ డేటా వంటి లేటెస్ట్ ఐసీటీ (Information and communucation technology) టెక్నాలజీస్‌లో బేసిక్ అంశాలను ఈ కోర్సులు కవర్ చేయనున్నాయి. విద్యార్థులు, విద్యావేత్తలు లేదా ICT పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్లు, నాన్- గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్స్ వారి ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఈ సాధారణ కోర్సుల కోసం ఎన్‌రోల్ అవ్వొచ్చు. ఆసక్తి ఉన్నవారు ‘‘Huawei ICT అకాడమీ కోర్స్ కేటలాగ్’’ సైట్‌లోకి లాగిన్ అయి, కావలసిన కోర్సు(Courses)ల కోసం నమోదు చేసుకోవాలి. ఒక్కో కోర్సుకు 2-4 లెసెన్స్‌తో మల్టిపుల్ సెల్ఫ్- స్టడీ మాడ్యూల్స్ ఉంటాయి.
ఈ కోర్సుల ద్వారా అభ్యర్థులు కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, ఇప్పటికే ఉన్న నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుందని హువావే ఐసీటీ అకాడమీ పేర్కొంది. తద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(Technology) (ICT)లో ప్రతిభను పెంచడంతో డిజిటల్ ఇండియా విజన్‌కు మద్దతు ఇవ్వడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు హువావే ఐసీటీ అకాడమీ పేర్కొంది.
హువావే ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ మాథుర్ మాట్లాడుతూ.. “డిజిటల్ యుగంలో టాలెంట్ సప్లై, డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ICT పరిశ్రమలో కార్యకలాపాలను మరింత హై-క్వాలిటీతో పెంపొందించడం కోసం హువావేలో ఐసీటీ సాంకేతికతలను, విజ్ఞానాన్ని అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చేసి, నిరంతరం అమలుచేస్తున్నాం.’’ అని తెలిపారు.
ప్రభుత్వ పిలుపు మేరకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అభ్యర్థులు బాగా అర్థం చేసుకోవడానికి లేదా ప్రస్తుత నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడం కోసం జనరల్ లెవల్‌లో ICT కోర్సులను ప్రారంభించనున్నట్లు మాథుర్ తెలిపారు. ఎడ్యుకేషన్(Education), ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ టాలెంట్ ఎకోసిస్టమ్‌లను బిల్డప్ చేయడం, తద్వారా ప్రతిభ సామర్థ్యాలను పెంపొందించడంతో ICT పట్ల ఆసక్తిని సృష్టించడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
సీడ్స్ ఫర్ ది ఫ్యూచర్, ICT అకాడమీ, ICT కాంపిటీషన్ వంటి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ద్వారా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ(University)ల్లో విద్యార్థుల ICT నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని హువావే ఇండియా పేర్కొంది. ఇండియాలో హువావే ఐసీటీ అకాడమీ 2015లో ప్రారంభమైంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇది విద్యా కార్యక్రమాలు చేపడుతోంది. ఐసీటీ రంగం అవసరాలు తీర్చడానికి ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ అందిస్తుంది. అంతేకాకుండా ఐసీటీ రంగానికి ప్రతిభ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై దృష్టిసారిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, Huawei, Information Technology, JOBS