Home /News /jobs /

HQ CENTRAL COMMAND RECRUITMENT 2022 APPLY FOR 88 WARD SAHAYIKA AND OTHER GROUP C POSTS AND STEPS HERE UMG GH

Army Jobs: పదోతరగతి అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్

పదో తరగతి అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.

పదో తరగతి అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.

ఇండియన్ ఆర్మీకి (Indian Army) చెందిన హెడ్ క్వార్టర్స్ (హెచ్‌క్యూ) సెంట్రల్ కమాండ్ జబల్‌పూర్.. గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు (Application) చేసుకోవాలని సూచించింది.

ఇండియన్ ఆర్మీకి చెందిన హెడ్ క్వార్టర్స్ (హెచ్‌క్యూ) సెంట్రల్ కమాండ్ జబల్‌పూర్.. గ్రూప్-సీ పోస్టుల భర్తీకి Notification విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉద్యోగ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ జూన్ 18న విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ -సీ కింద కుక్, వార్డ్ సహాయిక పోస్టులకు సంబంధించి మొత్తం 88 ఖాళీలను హెచ్‌క్యూ సెంట్రల్ కమాండ్ భర్తీ చేయనుంది. అభ్యర్థులు Application ఫారమ్‌ను నింపి, ఇచ్చిన చిరునామాకు పంపాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం

స్టెప్-1: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ పొందవచ్చు. ఈ ఫారమ్‌ను హిందీ లేదా ఇంగ్లిష్‌లో పూరించవచ్చు.

స్టెప్-2: పూర్తిగా నింపిన అప్లికేషన్‌కు అవసరమైన సెల్ప్ అటెస్టెడ్ డాక్యుమెంట్లను జత చేయాలి.

స్టెప్-3: అప్లికేషన్ ఫారమ్‌తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్‌ను హెచ్‌క్యూ(HQ), సెంట్రల్ కమాండ్(BOO-1), మిలిటరీ హాస్పిటల్ జబల్‌పూర్, మధ్యప్రదేశ్-482001. అనే అడ్రస్‌కు పోస్ట్ చేయాలి

అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా అందుకు సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఒక్కో పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఫరీక్ష ఫీజు రూ.100 పోస్టల్ ఆర్డర్‌ను దరఖాస్తుకు జత చేయాలి. అలాగే అభ్యర్థులు తమ చిరునామను పోస్టల్ కవర్‌పై కచ్చితంగా పేర్కొనాలి. చివరగా అప్లికేషన్‌తో కూడిన పోస్టల్ కవర్‌ను హెచ్‌క్యూ సెంట్రల్ కమాండ్, జబల్ పూర్- మధ్యప్రదేశ్‌కు పంపాలి.

డీఆర్‌డీఓ‌లో ఉద్యోగాలు..
రక్షణ శాఖకు చెందిన మరో సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) వివిధ విభాగాల్లో 58 సైంటిస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఆర్‌డీవో రిక్రూట్‌మెంట్ & అసెస్‌మెంట్ సెంటర్ (RAC) అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా జూన్ 28గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులు DRDO అవసరాలను బట్టి రిమోట్, ఫీల్డ్ లొకేషన్‌లలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను అందించాల్సి ఉంటుంది.

రిక్రూట్‌మెంట్ కోసం స్క్రీనింగ్ కమిటీ పేర్కొన్న విద్యార్హత, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇతర ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆపై ఒక పోస్ట్‌కు 12 మంది అభ్యర్థులు అంటే 1:12 నిష్పత్తిలో ఫైనల్ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. డీఆర్‌డీవో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసై ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు తాము కోరుకున్న పోస్టుల కోసం వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇతర అర్హత ప్రమాణాలను ఫుల్‌ఫిల్ చేయాలి.
Published by:Mahesh
First published:

Tags: Army, Army jobs, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు