హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

HPCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

HPCL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (HPCL Job Notification) విడుదల చేసింది. మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బ్లైండింగ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది HPCL. HR ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, లా ఆఫీసర్ మరియు మేనేజర్/సీనియర్ మేనేజర్ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు HPCL అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి నుంచి అంటే జూన్ 24 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ ను ఈ లింక్ ద్వారా చూడొచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 294 పోస్టులు భర్తీ చేయబడతాయి.

HPCL రిక్రూట్‌మెంట్ 2022 కోసం ముఖ్యమైన తేదీలు

-ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం - జూన్, 23

-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ-జూలై 22

Indian Airforce Agniveer Notification 2022: అగ్నివీర్ IAF నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..

HPCL రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఖాళీ వివరాలు

మెకానికల్ ఇంజనీర్ – 103

ఎలక్ట్రికల్ ఇంజనీర్ – 42

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ – 30

సివిల్ ఇంజనీర్ – 25

కెమికల్ ఇంజనీర్ – 7

ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్ – 5

సెక్యూరిటీ ఆఫీసర్ UP – 6

సెక్యూరిటీ ఆఫీసర్ TN – 1

సెక్యూరిటీ ఆఫీసర్ కేరళ – 5

సెక్యూరిటీ ఆఫీసర్ గోవా – 1

ఫైర్ & సేఫ్టీ ఆఫీసర్ – 2

క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ – 27

బ్లెండింగ్ ఆఫీసర్ – 5

చార్టర్డ్ అకౌంటెంట్ – 15

హెచ్ ఆర్ ఆఫీసర్ – 8

వెల్ఫేర్ ఆఫీసర్ విశాఖ రిఫైనరీ – 1

వెల్ఫేర్ ఆఫీసర్ – ముంబై రిఫైనరీ – 1

లా ఆఫీసర్ – 5

లా ఆఫీసర్ – 2

మేనేజర్ / సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ – 3

HPCL రిక్రూట్‌మెంట్ 2022 కోసం అర్హతలు:

వేర్వేరు పోస్టుల కోసం వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి విద్యార్హతల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. 25-37 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

HPCL రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ఫీజు:

UR, OBC & EWS అభ్యర్థులు – రూ.1180/- వరకు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST & PWD అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

First published:

Tags: Central Government Jobs, HPCL, JOBS

ఉత్తమ కథలు