హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 186 ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.55,000.. ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే చాన్స్‌!

HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 186 ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.55,000.. ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే చాన్స్‌!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

HPCL Recruitment 2022 | ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖప‌ట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ లో పలు పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.  ద‌ర‌ఖాస్తుకు మే 21, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖప‌ట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited)లో పలు పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.  ఈ నోటిఫికేష‌న్ విశాఖ రిఫైన‌రి కింద వివిధ విభాగాల్లో టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తుంది. అన్ని విభాగాల్లో క‌లిపి 186 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు ఏప్రిల్ 1, 2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. నోటిఫికేష‌న్ స‌మాచారం, అప్లికేష‌న్ విధానం కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మే 21, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

Teaching Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్.. డిగ్రీ, పీజీ చేసిన వారికి ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

పోస్టుల వివరాలు..

పోస్టుఖాళీలు
ఆప‌రేషన్స్ టెక్నిషియ‌న్‌94
బాయిల‌ర్ టెక్నిషియ‌న్‌18
మెయింటెనెన్స్ టెక్నిషియ‌న్ (మెకానిక‌ల్‌)14
మెయింటెనెన్స్ టెక్నిషియ‌న్ (ఎల‌క్ట్రిక‌ల్‌)17
మెయింటెనెన్స్ టెక్నిషియ‌న్ (ఇనుస్ట్రుమెంటేషన్)09
ల్యాబ్ అనలిస్ట్16
జూనియర్ ఫైర్ అండ్ సెఫ్టీ ఇన్ స్పెక్ట‌ర్18


అర్హ‌త‌లు..

ఆయా విభాగాల్లో పోస్టుల‌కు సంబంధించిన స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, సైన్స్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌, బాయిల‌ర్ కాంపిటెన్సీ స‌ర్టిఫికెట్, వాలిడ్ హెచ్ఎంవీ లైసెన్స్ క‌లిగి ఉండాలి.

ఎంపిక విధానం..

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

- అనంత‌రం ఎంప్లాయిమెంట్ మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Telangana Exam Tips: కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఎక్కు స్కోర్ సాధించేందుకు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి!

ప‌రీక్ష విధానం..

కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌/ టెక్నిక‌ల్/ ప‌్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. సీబీటీలో అర్హులైన అభ్య‌ర్థుల‌ను స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.hindustanpetroleum.com/job-openings లోకి వెళ్లాలి.

Step 3 - నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.1,60,000 అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

Step 4 - అనంత‌రం Click here to Apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

Step 5 - క్లిక్ చేసిన త‌రువాత https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp లింక్‌లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేష‌న్ ద్వారా మీ పూర్తి స‌మాచారం ఇచ్చి ఫాం నింపాలి.

Step 6 - త‌ప్పులు లేకుండా అప్లికేష‌న్ ఫాం నింపాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎటువంటి ఫీజు ఉండ‌దు. ఇత‌ర అభ్య‌ర్థుల‌క రూ. 590+ఇత‌ర చార్జీల‌తో క‌లిపి ఫీజు చెల్లించాలి.

Step 7 - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి మే 21, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Job notification, JOBS

ఉత్తమ కథలు