HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

HPCL Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

news18-telugu
Updated: November 22, 2019, 11:11 AM IST
HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి
HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విశాఖపట్నంలోని రిఫైనరీలో ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌పీసీఎల్. ఇవాళ హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2019 డిసెంబర్ 21 చివరి తేదీ.

HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 72

ఆపరేషన్స్ టెక్నీషియన్- 66
బాయిలర్ టెక్నీషియన్- 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 22


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 21విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

AP Jobs: ఏపీలో కొత్త జాబ్స్... 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు అప్లై చేయండిలా...

Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలు... త్వరలో 1,05,338 పోస్టుల భర్తీ

Telangana Jobs: 'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలు... అప్లికేషన్ లింక్ ఇదే
First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు