Home /News /jobs /

HPCL RECRUITMENT 2019 HINDUSTAN PETROLEUM CORPORATION LIMITED VISAKHAPATNAM NOTIFICATION FOR VARIOUS POSTS APPLY BEFORE SEPTEMBER 30 SS

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

HPCL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

    హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL విశాఖ రిఫైనరీలో ఉద్యోగాలున్నాయి. మెయింటనెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది హెచ్‌పీసీఎల్. మొత్తం 36 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎంపికైనవారికి 9 నెలలు ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    HPCL Recruitment 2019, Hindustan Petroleum Corporation Limited, HPCL jobs, HPCL careers, HPCL notification, హెచ్‌పీసీఎల్ రిక్రూట్‌మెంట్ 2019, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్ జాబ్స్, హెచ్‌పీసీఎల్ కెరీర్స్, హెచ్‌పీసీఎల్ నోటిఫికేషన్
    Source: HPCL

    HPCL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 36
    మెయింటనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)- 08
    మెయింటనెన్స్ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 05
    మెయింటనెన్స్ టెక్నీషియన్ (మెకానికల్)- 07
    ల్యాబ్ అనలిస్ట్- 04
    జూనియర్ ఫైర్ & సేఫ్టీ ఇన్‌స్పెక్టర్- 12

    HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 1
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 30
    విద్యార్హతలు- మెయింటనెన్స్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా. ల్యాబ్ అనలిస్ట్ పోస్టుకు బీఎస్సీ (కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్), ఎంఎస్సీ కెమిస్ట్రీ 60% మార్కులతో పాస్ కావాలి. జూనియర్ ఫైర్ & సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు సైన్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు HMV లైసెన్స్ ఉండాలి.
    వేతనం- రూ.40,000.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

    GSL Jobs: గోవా షిప్‌యార్డ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు... వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, HPCL, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు