హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉమ్మడి సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్-HRRL ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 24న ముగిసింది. లాక్డౌన్ కొనసాగుతుండటంతో గడువు పెంచింది హెచ్ఆర్ఆర్ఎల్. ఆసక్తి గల అభ్యర్థులు మే 10 వరకు దరఖాస్తు చేయొచ్చు. రాజస్తాన్‌లోని రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లో ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. ఇంజనీర్, హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీగల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hrrl.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 72
ఇంజనీర్- 66
ఫైనాన్స్- 02
హ్యూమన్ రీసోర్స్- 02
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్- 01
లీగల్- 01
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 10
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: పీజీ పాసైనవారికి 150 పోస్టులు... నేటి నుంచి దరఖాస్తులు
Degree: తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్
Telangana Jobs: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా కోర్సులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, HPCL, Job notification, JOBS, NOTIFICATION