HOW TO SET PRIORITY SUBJECT IN GATE 2022 TWO PAPERS KNOW COMBINATION EVK
GATE 2022: గేట్ 2022లో రెండు పేపర్లు రాస్తున్నారా.. ప్రియారిటీ సబ్జెక్ట్ ఎంచుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది GATE-2022కి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 1తో గడువు ముగుస్తోంది. ఈ సారి గేట్లో 29 పరీక్షా పత్రాలు ఉన్నాయి. అభ్యర్థి ఈ పేపర్లలో నుంచి ఒకటి లేదా రెండు పేపర్లు రాసే అవకాశం ఉంది. అందులో ప్రియారిటీని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
ఇంజనీరింగ్ విద్యార్థులు మాస్టర్ డిగ్రీ చేసేందుకు, పలు సంస్థల్లో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (Graduate Aptitude Test in Engineering) పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ ఏడాది GATE-2022కి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 1తో గడువు ముగుస్తోంది. ఈ సారి గేట్లో 29 పరీక్షా పత్రాలు ఉన్నాయి. అభ్యర్థి ఈ పేపర్లలో నుంచి ఒకటి లేదా రెండు పేపర్లు రాసే అవకాశం ఉంది. గేట్ 2022లో ఒకే పేపర్ రాసేవారికి ఏ మార్పులు లేకున్నా.. రెండు పేపర్లు రాసేవారికి మాత్రం ఏ పేపర్‌ను కాంబినేషన్లో ఎంచుకోవాలో తెలుసుకోవడం మంచింది. రెండు పేపర్లు రాసే అభ్యర్థి మొదటి పేపర్‌ను ఏదైనా ఎంచుకోవచ్చు. రెండు పేపర్ మాత్రం మొదటి పేపర్ కాంబినేషన్లో నుంచి మాత్రమే ఎంచుకోవాలి.
ఈ సారి పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) ఖరగ్‌పూర్ నిర్వహించనుంది. మొదటి పేపర్(Paper)తోపాటు ఎంచుకోవాల్సని రెండో పేపర్ సమాచారాన్ని gate.iitkgp.ac.in లో పొందుపరిచారు. గేట్ 2022: పేపర్ కాంబినేషన్
పేపర్ కాంబినేషన్ అంటే మొదటి పేపర్‌కు సరిపడే లేదా ఉపయోగపడేలా రెండో పేపర్ ఉంటుంది. ఉదాహరణకు రోస్పేస్ ఇంజనీరింగ్(Engineering)ను ఎంచుకునే అభ్యర్థులు రెండో పేపర్‌గా నావల్ ఆర్కిటెక్చర్ మరియు మెరైన్ ఇంజనీరింగ్ (కొత్త పేపర్), ఇంజనీరింగ్ సైన్సెస్‌లను ఎంచుకోవడానికి అవకాశం ఉంది.
అయితే, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హాజరు కావడానికి ఇష్టపడేవారు EC, GE, MA, PH, లేదా ST లను ఎంచుకోవాలి.
Gate 2022: పేపర్ కాంబినేషన్ సబ్జెక్టు కోడ్
AG - ES, GE, XE, XL
AR - CE, GE
BM - BT, EC, IN, XL
BT - BM, XL
CE - AE, AR, ES, GE, NM, XE
CH - PE, XE
CY - XE, XL
EC - IN, PH, EE, CS, GE
EE - EC, IN, PH
ES - AG, CE, GE
EY- XL
GE - CE, GG, ES, MN
GG- GE, MN, PE, PH, XE
IN - BM, EC, EE, PH
MA - CS, GE, PH, ST
ME - AE, CH, NM, PI, XE
MN - GE, GG, XE
MT - PH, XE
NM - AE, CE, XE
PE - CH, GG, XE
PH - EC, GE, GG, IN, MA, MT, ST, XE
PI - ME, MT, XE
ST - MA, PH
TF - XE
XE - AE, AG, CH, ME, MN, MT, PE, PI, TF, NM
XH - ST
పేపర్ ప్రియారిటీని ఎలా సెట్ చేసుకోవాలి..
ఎవరైన అభ్యర్థులు రెండు పేపర్లు రాయాలనుకొనే అభ్యర్థులు సెకండ్ పేపర్ ఎంపికను తెలివిగా ఎంచుకోవాలి. రెండో పేపర్ ఎంచుకొనేటప్పుడు నోటిఫికేషన్(Notification)లో ఇచ్చిన కాంబినేషన్ పేపర్‌ను ఎంచుకోవాలి. రెండో పేపర్‌కు సంబంధించి పరీక్షా కేంద్రం వేరుగా ఉండవచ్చు. మొదటి పేపర్ మాదిరిగానే పరీక్షా నగరం మాత్రం అలాగే ఉంటుంది. రెండు పేపర్లు రాయాలనుకొనే అభ్యర్థులు ఒక్క దరఖాస్తు(Application)ను మాత్రమే సబ్మిట్(Submit) చేయాలి. ఒక వేల ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేసినా.. అందులో నుంచి ఒక్కదాన్ని మాత్రే ఆమోదిస్తారు. మిగిలినవి తిరస్కరిస్తారు. దరఖాస్తు చేసుకొన్న తరువాత డబ్బులు తిరిగి చెల్లించబడవు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.