Home /News /jobs /

HOW TO PREPARE FOR LANGUAGE PANDIT EXAMS DO YOU KNOW HOW MANY MARKS ARE THERE FOR SUBJECT KNOW FULL DETAILS HERE BK VB

Language Pandit Exams: లాంగ్వేజ్ పండిట్ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏ స‌బ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటాయో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లాంగ్వేజ్ పండిట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఎలా స్ట‌డీ ప్లాన్ ను రూపొందించుకోవాలి. ఏఏ స‌బ్జెక్ట్ ల్లో ప‌ట్టు సాధించాలి అనే అంశాలు అభ్య‌ర్థుల్లో మెద‌లాడే ప్ర‌శ్నలు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (M. Balakrishna, News 18, Hyderabad)

    తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లాంగ్వేజ్ పండిట్ రిక్రూట్‌మెంట్(Recruitment) నోటిఫికేష‌న్(Notification) విడుదల చేసింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఎలా స్ట‌డీ ప్లాన్ ను రూపొందించుకోవాలి. ఏఏ స‌బ్జెక్ట్ ల్లో ప‌ట్టు సాధించాలి అనే అంశాలు అభ్య‌ర్థుల్లో మెద‌లాడే ప్ర‌శ్నలు(Questions). అయితే ఈ ప‌రీక్ష‌కు ఎలా ప్రిపేర్(Prepare) అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ‌హించే ఈ పోస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ పండిట్ లు(Language Pandit) హిందీ(Hindi), తెలుగు(Telugu), ఉర్దూ(Urdu), మరాఠీ, స‌బ్జెక్ట్ ల్లో ఉంటుంది. అయితే ఈ ప‌రీక్ష‌ల్లో సాధారణంగా జ‌నరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ తో(General Knowledge And Current Affairs) పాటు.. అన్ని త‌ర‌గ‌తుల స‌బ్జెక్ట్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

    SGT Preparation Plan: ఎస్జీటీకి ఇలా ప్రీపేర్ అవ్వండి.. విజయం మీ సోంతం అయినట్లే..



    లాంగ్వేజ్ పండిట్ - హిందీ సిలబస్ ముఖ్యంగా ఈ క్రింది స‌బ్జెక్ట్ ల్లో మార్కులు ఈ విధంగా ఉంటాయి.

    పార్ట్ 1 – జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (మార్కులు: 10)
    పార్ట్ 2 – ప్రోస్ఫెక్టివ్ ఆఫ్ ఎడ్యూకేష‌న్ (మార్కులు: 10)
    పార్ట్ 3 – కంటెంట్ (మార్కులు: 44)
    పార్ట్ 4 - టీచింగ్ మెథడాలజీ (మార్కు 16)

    లాంగ్వేజ్ పండిట్  - తెలుగు సిలబస్ లో మార్కులు స‌బ్జెక్ట‌ులు వారీగా ఇలా ఉంటాయి.

    పార్ట్ 1 – జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (మార్కులు: 10)
    పార్ట్ 2 – ప్రోస్ఫెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ (మార్కులు: 10)
    పార్ట్ 3 – కంటెంట్ (మార్కులు: 44) – తెలుగు
    పార్ట్ 4 – తెలుగు భాషా బోధన (మార్కులు : 16)



    లాంగ్వేజ్ పండిట్  - ఉర్దూ సిలబస్ లో మార్కులు స‌బ్జెక్ట‌ులు వారీగా ఇలా..

    పార్ట్ 1 – జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (మార్కులు: 10)
    పార్ట్ 2 – ప్రోస్ఫెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేష‌న్  (మార్కులు: 10)
    పార్ట్ 3 – కంటెంట్ (మార్కులు: 44)
    పార్ట్ 4 – టీచింగ్ మెథడాలజీ (మార్కులు: 16)

    లాంగ్వేజ్ పండిట్ - మరాఠీ సిలబస్ లో మార్కులు స‌బ్జెక్ట‌లు వారిగా ఇలా ఉంటాయి.

    పార్ట్ 1 – జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (మార్కులు: 10)
    పార్ట్ 2 – ప్రోస్ఫెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేష‌న్  (మార్కులు: 10)
    పార్ట్ 3 – కంటెంట్ (మార్కులు: 44)- మరాఠీ
    పార్ట్ 4 – టీచింగ్ మెథడాలజీ (మార్కులు : 16)

    Four Days Working In A Week: ఉద్యోగులకు వారంలో 3 రోజులు వీక్లీ ఆఫ్స్.. ఎప్పటినుంచంటే..


    ఈ పరీక్షలో ప్ర‌శ్న‌ల‌న్ని ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటాయి. ప్రశ్నాపత్రంలో 80 మార్కులకు 160 MCQలు ఉంటాయి. సమయం 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అంతే కాకుండా.. ఈ ప‌రీక్ష‌లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండ‌దు. ఈ విషయాన్ని పరీక్షలు రాసే అభ్యర్థులు గమనించాలి.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, Exam Tips, JOBS, Preparation, Telugu language, Telugu pandit

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు