(అన్నా రఘు, అమరావతి ప్రతినిధి, న్యూస్ 18)
విద్యార్థులు సాధారణంగా ఎగ్జామ్స్(Exams) అంటే భయాందోళనకు గురవుతుంటారు. అలా భయపడకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్(Competitive Exams) తో పాటు.. ఎంట్రెన్స్ పరీక్షలు సులువుగా రాయొచ్చు అని అంటున్నారు సీనియర్ అధ్యాపకులు వెంకటకృష్ణ . ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. సంక్షిప్తంగా ఐసెట్(I CET). రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ముఖ్యంగా ఎంబీఏ(MBA) పట్టాతో మేనేజ్‌మెంట్(Management) నిపుణులుగా రాణించాలనుకుంటున్న వారికి రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకమైన పరీక్ష ఐసెట్(I CET). అదే విధంగా ఎంసీఏతో సాఫ్ట్‌వేర్ రంగంలో కొలువులు కోరుకునే వారికి కూడా ఐసెట్ ఉపయుక్త పరీక్ష.
ఎగ్జామ్స్ ఏవైనా సరే విద్యార్ధులు(Students) ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని చదువుకోవడం చాలా కీలకమైన విషయం . అందులోనూ తెల్లవారుజామున లేచి చదువుకుంటే జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆ టైం లో చదివిన విషయాలు విద్యార్థులకు బాగా గుర్తుండిపోతాయి. అదే విధంగా చదువుకుంటున్న సమయంలో సెల్ ఫోన్లను దూరంగా పెట్టాలి. ఇతరులతో మాట్లాడం వంటివి చేయకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని ప్రతి పాయింట్ టు పాయింట్ పేపర్ మీద రాస్తూ చదువుతూ ఉండటం వల్ల ఆ సబ్జెక్ట్ పై అవగాహన పెరిగి ఆ అంశాలు అనేవి రైట్ బ్రెయిన్ కు చేరుతుంది.
తద్వారా పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు . నేల పై కూర్చుని చదవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి . చిన్నతనంలో టీచర్లు మనతో గట్టిగా అరిపిస్తు చదివించే వాళ్ళు అలా చేయడం వల్ల చదివింది ముందు లెఫ్ట్ బ్రెయిన్ లోకి వెళ్లి తరువాత రైట్ బ్రెయిన్ కు వెళ్తుంది.
అలా కాకుండా డైరెక్ట్ గా చదివింది రైట్ బ్రెయిన్ కు వెళ్లాలంటే చదువుతున్న టాపిక్ లో ముఖ్యమైన అంశాలు అండర్లైన్ చేస్తూ ఒక బుక్ లో వాటిని రాస్తూ చదువుతుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా నోట్ బుక్ లో రాసుకున్న అంశాలను ఒకటి రెండు సార్లు రివిజన్ చేసుకుంటే మెదడులో ఎక్కువ కాలం ఉంటాయని సీనియర్ అధ్యాపకులు వెంకటకృష్ణ న్యూస్ 18 తో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exam Tips, Exams, JOBS, TS ICET 2022