రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్ పెట్టడం మరవొద్దు..

Success mantra | ‘సెల్ఫ్ రెజ్యూమ్’ ప్రిపేర్ చేసుకోండి. వీటివల్ల ఇందులో మీరు ఎప్పుడూ స్టడీ పూర్తి చేశారు. ఎప్పుడూ ఉద్యోగవేటలో పడ్డారు. ఎన్ని ఇంటర్వ్యూస్‌కి వెళ్లారు. అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు వంటివి రాసుకోండి. వీటిని మీ పేరెంట్స్ లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్.. ఆల్రెడీ పెద్ద సంస్థలో జాబ్ చేస్తున్న మీ సన్నిహితులకు ఫార్వర్డ్ చేసి ఏం చేస్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి.

news18-telugu
Updated: May 24, 2019, 6:13 PM IST
రెజ్యూమ్‌లో ఈ పాయింట్స్ పెట్టడం మరవొద్దు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 24, 2019, 6:13 PM IST
ఏ జాబ్ చేయడానికైనా ముందు రెజ్యూమ్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. మన గురించి తెలిపే సీవీ ఎంత బాగుంటే.. జాబ్ సంపాదించడం అంత ఈజీ అవుతుంది. అంతటి ఇంపార్టెంట్ ఉన్న రెజ్యూమ్‌ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ, దీని గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. ఏదో ఫార్మాలిటీగా ప్రిపేర్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. అలా కాకుండా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తెలిపేవిధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి.

ముందుగా మీ గురించి సమాచారాన్ని మొత్తం తెలియజేయాలి. మీ పేరు, ఫొన్ నెంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయాలి. తర్వాత స్టెప్‌లో మీ స్టడీ గురించి తెలియజేయాలి. ఆ వెంటనే మీ ఇతర క్వాలిఫికేషన్స్, టెక్నికల్ పరమైన అంశాలు జోడించాలి.

చివరగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అయితే, వీటన్నింటినికూడా ఏదో చెబుతున్నామంటే చెబుతున్నామన్నట్లు కాకుండా పద్ధతిగా పొందికగా తెలియజేయాలి. ఈ విషయంలో అస్సలు రాజీ పడొద్దు. అవసరమైతే వీటి తయారీకోసమే ఉండే ప్రొఫెషనల్స్ ఉంటారు. వారి ద్వారా చేయించండి..

వీటితో పాటు..‘సెల్ఫ్ రెజ్యూమ్’ ప్రిపేర్ చేసుకోండి. వీటివల్ల ఇందులో మీరు ఎప్పుడూ స్టడీ పూర్తి చేశారు. ఎప్పుడూ ఉద్యోగవేటలో పడ్డారు. ఎన్ని ఇంటర్వ్యూస్‌కి వెళ్లారు. అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు వంటివి రాసుకోండి. వీటిని మీ పేరెంట్స్ లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్.. ఆల్రెడీ పెద్ద సంస్థలో జాబ్ చేస్తున్న మీ సన్నిహితులకు ఫార్వర్డ్ చేసి ఏం చేస్తే సక్సెస్ అవుతారో తెలుసుకోండి. వారిచ్చే సలహాలతో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. దీనిపైనే మీ సక్సెస్ ఆధారపడుతుందని మరవకూడదు. కాబట్టి.. ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు మీకు మీరే తెలుసుకుంటే ఖచ్చితంగా సెక్స్ అవుతారు.ఇవి కూడా చదవండి..

RRB NTPC Recruitment 2019 : RRB NTPC పోస్టుల సంఖ్య పెంపు.. అప్లై చేసినవారు ఇలా చేయండి..
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...