Home /News /jobs /

HOW TO GET GOOD MARKS IN SSC SOCIAL EXAMS HERE IS SOME TIPS FROM EXPERTS BA

Exam Tips | పదోతరగతి సోషల్ ఇలా ప్రిపేర్ అవ్వండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాస్త మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకుంటే ఇందులో మంచి మార్క్ లు సాధించొచ్చు అంటున్నారు ఉపాధ్యాయులు.

    (ఉపాధ్యాయురాలి పేరు: శ్రీదేవి, సోషల్ టీచర్, రవీంద్రభారతి స్కూల్, హైదరాబాద్)

    పదోతరగతి పాఠ్యాంశాల్లో మరో కిలకమైన సబ్జెక్ట్ సోషల్. కాస్త మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకుంటే ఇందులో మంచి మార్క్ లు సాధించొచ్చు అంటున్నారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా సోషల్ లో మంచి మార్కులు సాధించాలంటే రోజూ జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అంశాల్లో మంచి అవగాహన పెంచుకోవాలని సోషల్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి తెలిపారు.

    పదోతరగతి సోషల్ ఇలా ప్రిపేర్ అవ్వండి

    1. రోజులో కనీసం రెండు గంటల సమయం జనరల్ నాలెడ్జ్ ను పెంపొందించుకోవడానికి కేటాయించడం మంచిది.

    2. భౌగోళిక అంశాలపై అవగాహన పెంచుకుంటే వాటికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి.

    3. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మ్యాప్ ల అవుట్ లైన్ వేయడం నేర్చుకావాలి.

    4. ఇండియా మ్యాప్ లో ఏ రాష్ట్రం ఎక్కడ ఉందో పాయింటింగ్ చేయడం వలన కూడా మంచి మార్కులు వస్తాయి.

    5. ఈ మధ్యకాలంలో ప్రధానమైన ప్రభుత్వ నిర్ణయంపై కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. (ఉదాహరణకు సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి అంశాలపై)

    6. వీటితోపాటు పాఠ్యాంశాల్లో అన్ని అంశాలను పూర్తిగా చదవాలి. అలా చేయడం వలన పుస్తకంలో ఉన్న పాఠ్యంశాలపై పూర్తి స్థాయి అవగాహన వస్తోంది.

    తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదలైంది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 6వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1తో పరీక్షలు ముగుస్తాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6న పరీక్షలు ముగియనున్నాయి.

    (ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Exams, Ssc exams

    తదుపరి వార్తలు