Home /News /jobs /

HOW TO GET GOOD MARKS IN SSC PHYSICS HERE ARE SOME EXAM TIPS SK

Exam Tips | పదోతరగతి ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించడానికి టిప్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిజిక్స్ సబ్జెక్ట్‌కు కాస్త లెక్కలతో కూడా సంబంధం ఉంటుంది. మ్యాథ్స్ తరహాలోనే ఫిజిక్స్‌లోనూ ఫార్ములాలతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది.

    కోటేశ్వరరావు (భౌతికశాస్త్రం, రవీంద్రభారతి స్కూల్స్, హైదరాబాద్)

    పదోతరగతి భౌతిక రసాయన శాస్త్రం.. కాస్త శ్రద్ధ పెట్టి చదవాల్సిన సబ్జెక్ట్.  పక్కా ప్రణాళికతో చదివితే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. ఐతే ఏ మాత్రం  ఏమరపాటుగా వ్యవహరించినా  మార్కులు వదులుకోవాల్సి వస్తందుంటున్నారు నిపుణులు. ఫిజిక్స్ సబ్జెక్ట్‌కు కాస్త లెక్కలతో కూడా సంబంధం ఉంటుంది. మ్యాథ్స్ తరహాలోనే ఫిజిక్స్‌లోనూ ఫార్ములాలతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది.

    పదో తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో మొత్తం 14 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో 1, 3, 5, 6, 7, 11, 12 యూనిట్లు భౌతిక శాస్త్రానికి; 2, 4, 8, 9, 10, 13, 14 యూనిట్లు రసాయన శాస్త్రానికి చెందినవి.

    భౌతిక శాస్త్రానికి సంబంధించి ముఖ్యమైన అధ్యాయాలు:
    1) ఉష్ణం,

    2) కాంతి,

    3) విద్యుత్తు.

    రసాయన శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయాలు:

    రసాయన చర్యలు, సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, కార్బన్ దాని సమ్మేళనాలు తదితరాలపై దృష్టి సారించాలి.

    ( ఇవన్నీ పాత సిలబస్లోనివే. కొత్తగా ప్రవేశ పెట్టిన ‘లోహ సంగ్రహణ శాస్త్రం’పై ప్రత్యేక దృష్టి సారించాలి. )

    వీటితోపాటు క్రింది అంశాలు కూడా తెలుసుకోవాలి.

    గాల్వనోమీటర్
    బ్లాస్ట్ కొలిమి
    ధర్మామీటర్,
    వాషింగ్ సోడా
    విద్యుత్ మోటార్
    విద్యుత్ ఘటం
    ఓల్టుమీటర్
    బ్లీచింగ్ పౌడర్
    రియోస్టాట్
    అమ్మీమీటర్
    పట్టకం

    ఇదిలా ఉంటే స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: EDUCATION, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు