ప్రసాద్ (లెక్కల మాస్టారు, రవీంద్రభారతి స్కూల్స్, హైదరాబాద్)
పదోతరగతి పాఠ్యాంశాల్లో మరో ముఖ్యమైన సబ్జెక్ట్ లెక్కలు. ఎక్కువ మంది విద్యార్ధులు ఈ సబ్జెక్ట్ లో వందకు వంద మార్కులు సాధిస్తారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తతో మరిన్ని మార్కులు సాధించవచ్చంటున్నారు పదోతరగతి విద్యార్థులకు మ్యాథ్స్ బోధించే మాస్టార్ ప్రసాద్. ముఖ్యంగా లెక్కలు అంటేనే కొంత మంది విద్యార్థుల్లో చాలా భయాలు ఉంటాయి. అయితే ఆ భయాన్ని పక్కన పెడితే మంచి మార్కులు సాధించడానికి ఈ సబ్జెక్ట్ ఒక వరం అంటున్నారు.
మంచి మార్కులు సాధించడానికి ఈ చిట్కాలు పాటించండి
ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ లో ఫార్ములాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యమైన ఫార్ములాలను అర్థం చేసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
ఫార్ములాలను బట్టీపట్టే ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం. ఒకటి రెండు సార్లు అయినా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా ఆన్సర్ షీట్ పూరించేటప్పుడు చేతిరాత స్పష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే కొన్ని నెంబర్లు అర్థం కాకుండా వస్తే పేపర్ దిద్దే వారు కన్ఫ్యూజ్ అయి మీరు సమాధానం సరిగ్గా రాసినా మార్కులు వేయరు.
ఆన్సర్ షీట్ కు రెండు వైపులా మార్జిన్ కొట్టుకోవడం మంచింది. కుడి వైపు మార్జిన్ లో మాత్రమే ఏమైనా రఫ్ నోట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే పొరపాటున మీరు ఆన్సర్ లో స్పష్టంగా రాయకపోయినా రఫ్ షీట్ లో చేశారు కాబట్టి అక్కడ కరెక్ట్ గా ఉంటే మీకు మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇదిలా ఉంటే స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19 నుంచి 2020 ఏప్రిల్ 6వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.